Saturday, September 13, 2025 11:37 AM
Saturday, September 13, 2025 11:37 AM
roots

వినేష్ ఫోగట్ అనర్హత వెనుక కుట్రకోణం?

ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు ముందు వినేష్ ఫోగట్ అనర్హతకు గురి కావడం పట్ల ఇప్పుడు క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొత్తం బరువు వివాదాన్ని వెలుగులోకి తెచ్చారు. వినేష్ బుధవారం తన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు సిద్దం కాగా ఉదయం ఆమె బరువుని పరిశీలించారు. అయితే ఆమె 50 కిలోల విభాగంలో సుమారు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించలేకపోయింది. ఇంతవరకు మనకందరికీ తెలిసిందే.

అయితే మంగళవారం మ్యాచ్ తర్వాత వినేష్ బరువు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగిందని డాక్టర్ పార్దివాలా పేర్కొన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సకాలంలో తగ్గించలేకపోయామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు సాధారణంగా వారి సహజ బరువు కంటే తక్కువ బరువు కేటగిరీలో పాల్గొంటారన్నారు. ఉదయం బరువును తగ్గించే ప్రక్రియలో భాగంగా… ఆహారం, నీటికి పరిమితి ఉంటుందన్నారు. ఇది కాకుండా, అథ్లెట్‌కు చెమట పట్టడం అవసరం అన్నారు. అయితే ఇలా చేయడం కారణంగా ఆమె డీ హైడ్రేషన్ కు గురి అయింది అన్నారు. పార్టిసిపేషన్ తర్వాత ఆమె బరువు సాధారణం కంటే ఎక్కువగా పెరిగిందని గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఆమె కోచ్ ఆమె బరువుని తగ్గించే పని మొదలుపెట్టినా బరువు చూసే సమయానికి మరొక 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

అయితే, ఉదయం మేము అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె బరువు 50 కిలోగ్రాముల కంటే 100 గ్రాములుగా ఉందని అందుకే ఆమెపై అనర్హత వేటు వేసారని అన్నారు. ఆమె జుట్టును కత్తిరించడం, అలాగే ఆమె రక్తం కూడా కొంత తీసుకోవాలని అనుకుందని అలా దాదాపుగా కేజీ పైగా బరువు తగ్గారని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా, డీహైడ్రేషన్‌ను నివారించడానికి వినేష్‌కి కొన్ని ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లను అందించారని తెలిపారు. అయితే సెమీఫైనల్ మ్యాచ్ తరువాత అక్కడి వారు తనకి ఒక డ్రింక్ ఇచ్చారని, దాన్ని తాగడం వల్లనే ఆమె ఊహించిన దానికంటే అధికంగా బరువు పెరిగిందని, దీని వెనుక కుట్ర కోణం లేకపోలేదని ఒక సీనియర్ అథ్లెట్ వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్