“ప్రతి చోట పోటీ చేయాల్సిందే.. ఎక్కడా ఏకగ్రీవాలకు ఆస్కారం లేదు.. ఏ ఒక్క చోట అయినా సరే.. ఏకగ్రీవంగా కూటమి పార్టీలు సీటు దక్కించుకుంటే.. అక్కడ మన పార్టీ వాళ్లదే బాధ్యత. ఆ నియోజకవర్గం ఇంఛార్జ్‌కు ఎన్నికల్లో సీటు లేదు. బీ కేర్ ఫుల్.. గెలిచినా, ఓడినా సరే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే.. పోటీ చేయాల్సిందే. డబ్బులు లేవు, అభ్యర్థులు లేరు.. అని కుంటి సాకులు చెప్పొద్దు. మీకు సీటు కావాలంటే.. అభ్యర్థిని పోటీలో పెట్టాల్సిందే.” ఇది వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరిగ్గా నెల రోజుల క్రితం ఇచ్చిన వార్నింగ్.
Also Read : ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా వేరే..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే పలుచోట్ల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా.. మిగిలిన రాష్ట్రమంతా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 28న తొలిదశ పోలింగ్ ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు. అటు అన్ని పార్టీ అభ్యర్ధులు కూడా ఇప్పటికే ప్రచారంపై దృష్టి పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో తొలిదశ నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తర్వాత పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడూ లేనట్లుగా వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. చివరికి పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేదని దయనీయ స్థితికి వైసీపీ దిగజారిపోయింది. “మా అన్న పులి” అనేది కేవలం గాలి మాట మాత్రమే అని తొలి విడతలోనే తేలిపోయింది.
Also Read : తిరువూరు కూటమిలో అసమ్మతి.. కొలికపూడి రచ్చ..!
పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పెత్తనానికి బ్రేకులు పడ్డాయి. పుంగనూరు మునిసిపల్ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటుందని స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. పుంగనూరులో వైసీపీ పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి చేసిన ప్రకటన ఆ పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి పుంగనూరులో వైసీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో పుంగనూరు మునిసిపాలిటీలో తొలిసారి టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచారు. జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్న కమలాపురంలో కూడా ఏకగ్రీవమే. గురజాలలో మొత్తం మునిసిపాలిటీని ఏకగ్రీవంగా కూటమి సొంతం చేసుకుంది. దర్శి మునిసిపాలిటీ జనసేన ఖాతాలో చేరిపోయింది. అక్కడ కూడా వైసీపీ నామినేషన్ వేయలేదు.
Also Read : జగన్.. వారం క్రితం జరిగిందే మర్చిపోయారా..?
జగన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇప్పుడు పుంగనూరు, కమలాపురం, రాయచోటి, గురజాల, దర్శి నియోజకవర్గాల ఇంఛార్జులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేనట్లేనా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీటిల్లో పుంగనూరు, దర్శిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జగన్ రాజకీయ సమాధి కట్టినట్లేనా అని విమర్శలు చేస్తున్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో కూడా 66 డివిజన్లకి 52 ఏకగ్రీవాలు అయ్యాయి. అంటే.. అక్కడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బాధ్యుడిగా చేసి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదు పో.. అని జగన్ చెప్పేస్తారా.. అని సోషల్ మీడియాలో ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం.. మా అన్న చెప్తారంతే.. చేయరులే.. ఏం భయం వద్దు..అంతా మూడు రాజధానుల మాదిరిగానే ఉంటుంది.. అని సెటైర్లు వేస్తున్నారు కూడా.


