Thursday, October 15, 2026 02:15 PM
Thursday, October 15, 2026 02:15 PM

అర్ధరాత్రి ట్వీట్ చేసిన జగన్.. క్యాడర్ కు లీకులు ఇస్తున్నట్టా..?

ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా జాతీయ అంశాలపై ఆచితూచి స్పందించే జగన్, అక్టోబర్ 14 న అర్ధరాత్రి వేళ ఢిల్లీలో సీజేపి నేతల అరెస్టులపై స్పందించడం రాజకీయ వర్గాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరించాలని, వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని కోరుతూ జైలుకు వెళ్లిన సీజేపి నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను సమర్థిస్తూ జగన్ బహిరంగంగా మద్దతు తెలపడం వెనుక జాతీయ స్థాయి వ్యూహం ఉందనే చర్చ జోరందుకుంది.

Also Read : వైసీపీలో జగన్ ముందు అసలు సవాల్..!

జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వ విధానాలకు, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో ఈ ట్వీట్ రావడం గమనార్హం. ఇప్పటివరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పలు బిల్లుల విషయంలో పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా సాగుతున్న ఉద్యమకారులకు సానుభూతి ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ లైన్‌కు దగ్గరవుతున్నారనే సంకేతాలు ఇస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం ఊపందుకుంది.

Also Read : వంశీపై యార్లగడ్డ సంచలన కామెంట్స్..!

ఏపీలో సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, జగన్ జాతీయ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భవిష్యత్తు రాజకీయ అవసరాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి, ఈడీ విచారణల కంగారు, పార్టీ అంతర్గత సమీక్షల ఒత్తిడి నడుస్తుండగానే, జగన్ వ్యుహాత్మకంగా మౌనం వీడి ఈ అర్ధరాత్రి ట్వీట్ చేయడం విశేషం. ఇది కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన పోస్ట్ మాత్రమేనా లేక కేంద్ర పెద్దలపై ఒత్తిడి పెంచి జాతీయ స్థాయిలో కొత్త మిత్రులను వెతుక్కునే ముందస్తు అడుగా అనేది రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచింపజేస్తోంది. మొత్తానికి జగన్ చేసిన ఈ ట్వీట్.. అటు కాంగ్రెస్ కు దగ్గర కాబోతున్నాం అనే సంకేతాలను కూడా క్యాడర్ కు ఇచ్చినట్లు ఉందనే మాట వినపడుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ...

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి....

కేసుల ఉచ్చు బిగుస్తోందా?...

ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక కేసుల్లో చోటుచేసుకుంటున్న...

వంశీపై యార్లగడ్డ సంచలన...

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉండే...

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

హైదరాబాద్ టీ20 ముంగిట...

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

పోల్స్