Tuesday, October 13, 2026 01:00 PM
Tuesday, October 13, 2026 01:00 PM

ఏపీలో మున్సిపల్ సమరానికి సై.. రేపే షెడ్యూల్ విడుదల..?

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేసింది. అక్టోబర్ 14న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, ఆ తర్వాత అక్టోబర్ 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సైతం కీలక ప్రకటన చేశారు.

Also Read : బాంబు పేల్చిన రాహుల్.. అతన్ని నిద్రపోనివ్వం..!

రాష్ట్రంలో మొత్తం ఉన్న స్థానిక సంస్థల్లో మొదటి విడత కింద 100 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ వంద ప్రాంతాల్లో ఒకే విడతలో మున్సిపల్ పోరును పూర్తి చేయనున్నారు. అయితే, కొన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన, కోర్టు పరిధిలోని అంశాల వల్ల మిగిలిన 23 స్థానాలకు సంబంధించి ఎన్నికలను కాస్త ఆలస్యంగా నిర్వహించనున్నారు. వీటి కోసం ఎస్‌ఈసీ విడిగా రెండో నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది.

Also Read : విజయవాడ మేయర్ అభ్యర్థి ఫిక్స్..!

ఎన్నికల ప్రకటనకు ముందు అత్యంత కీలకమైన మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. మొత్తం 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులకు, అలాగే 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి 50 శాతానికి మించకుండా ఈ కేటాయింపులు జరిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు, మరియు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదిక ఆధారంగా బీసీలకు స్థానాలను కేటాయించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

కూటమిలో సీట్ల పంచాయతీ..!

స్థానిక సమరానికి తెరలేసింది. కూటమిలో సీట్లు...

బాంబు పేల్చిన రాహుల్.....

దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఓటర్ల...

తమిళనాడు సీఎం విజయ్...

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక...

పోల్స్