ఆటిజం, ఇతర మానసిక సవాళ్లతో బాధపడుతున్న పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, కోపం, భావోద్వేగాలను నియంత్రించడం చాలా పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఇలాంటి పిల్లల కోసం సాధారణంగా అందించే సాంప్రదాయ చికిత్సలు అందరికీ ఒకేలా పని చేయకపోవచ్చు. అయితే, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అన్షుట్జ్ మెడికల్ క్యాంపస్ పరిశోధకులు చేసిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, గుర్రాలతో ముడిపడి ఉన్న నిర్మాణాత్మక పనులు, గుర్రపు స్వారీ ఆటిజం ఉన్న పిల్లల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తున్నట్లు తేలింది.
Also Read : మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఇవే..? మహిళలకు 50 శాతం కోటా..!
ఈ పరిశోధనలో భాగంగా ఆటిజంతో పాటు ఇతర మానసిక సమస్యలు ఉన్న పిల్లలను మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపు పిల్లలకు థెరప్యూటిక్ గుర్రపు స్వారీ నేర్పించారు, రెండో గ్రూపు పిల్లలను కేవలం గుర్రాల శాలలో ఉంచి గుర్రాలకు సంబంధించిన పనులు చేయించారు, మూడో గ్రూపు పిల్లలను ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. ఈ ప్రయోగంలో నేరుగా గుర్రపు స్వారీ చేసిన పిల్లల్లో హైపర్ యాక్టివిటీ సమస్య చాలా వేగంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also Read : తమిళనాడు సీఎం విజయ్ ఏపీ షెడ్యూల్ ఇదే..!
అయితే ఈ థెరపీ కేవలం గుర్రపు స్వారీకే పరిమితం కాలేదు. గుర్రాలను తాకకుండా, కేవలం వాటి శాలలో ఉంటూ గుర్రాల గురించి తెలుసుకున్న రెండో గ్రూపు పిల్లల్లో కూడా కోపం తగ్గడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు సామాజిక నైపుణ్యాలు మెరుగవ్వడం వంటి సానుకూల మార్పులు కనిపించాయి. గుర్రాలు మనుషుల శారీరక భాషను బాగా అర్థం చేసుకుంటాయని, వాటితో గడపడం వల్ల పిల్లలు తమ సొంత ప్రవర్తనను మార్చుకోవడానికి, ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ మందుల వాడకానికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా లేదా అదనపు సపోర్ట్‌గా ఉపయోగపడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.


