Sunday, October 11, 2026 11:05 PM
Sunday, October 11, 2026 11:05 PM

గౌతమ్ గంభీర్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై, జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లను ఆయన నడిపిస్తున్న తీరుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంభీర్ హయాంలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ వంటి ఐసీసీ టైటిళ్లను గెలుచుకుని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన మాట వాస్తవమేనని.. అయితే, వైట్-బాల్ క్రికెట్‌లో జట్టు సాధించిన విజయాల వెనుక కొందరు కీలక ఆటగాళ్లకు గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ అస్సలు బాలేదని, వారిని జట్టు నుంచి తప్పించిన విధానం మరింత మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేదని జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డారు.

Also Read : ప్రెగ్నెన్సీ వార్తపై కియారా అద్వానీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

ముఖ్యంగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీల పట్ల మేనేజ్‌మెంట్ ప్రవర్తించిన తీరును జాఫర్ తీవ్రంగా తప్పుపట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా భారత్‌కు టీ20 ప్రపంచకప్ 2026 అందించి ఎంతో విజయవంతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నప్పటికీ, ఆ వెంటనే అతనిని జట్టు నుంచి నిస్సిగ్గుగా పక్కనబెట్టడం సరైన నిర్ణయం కాదని విమర్శించాడు. అదేవిధంగా ఎన్నో అద్భుత విజయాలు అందించిన మహమ్మద్ షమీ లాంటి దిగ్గజ ఆటగాళ్లను కూడా జట్టు నుండి తొలగించిన విధానం కరెక్ట్ కాదని, సీనియర్లను గౌరవించే విషయంలో గంభీర్ మేనేజ్‌మెంట్ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశాడు.

Also Read : టెక్కీలకు ట్రంప్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం..!

పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పక్కనబెడితే, గంభీర్ కోచింగ్ కెరీర్‌పై టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో పెద్ద మచ్చలు పడ్డాయని జాఫర్ విశ్లేషించాడు. స్వదేశంలో న్యూజీలాండ్ చేతిలో ఘోరంగా 0-3తో వైట్‌వాష్ అవ్వడం, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనలో 0-2తో టెస్ట్ సిరీస్ కోల్పోవడం గంభీర్ సీవీలోనే కాకుండా, కెప్టెన్ మరియు జట్టు ప్రతిష్టకు పెద్ద దెబ్బ అని అన్నారు. ఈ ఘోర పరాజయాల వల్లే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయిందని, టెస్టుల్లో జట్టును బలోపేతం చేయడానికి గంభీర్ ఇంకా ఎంతో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని హితవు పలికాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్