అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల సమయంలో కలిసి పని చేసిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పై అభిప్రాయ భేదాలు రావడంతో మస్క్ వ్యాపారాలపై దెబ్బ పడే అవకాశం ఉంటుందని భావించారు. ఈ క్రమంలో మస్క్ పార్టీ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది అనే వార్తలు సైతం వచ్చాయి. ఇలాంటి సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
Also Read : వైసీపీ మైండ్ గేమ్.. వర్కవుట్ అవుతుందా..?
ఇటీవల ట్రంప్ సర్కార్ తీసుకురావాలనుకున్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తనపై విమర్శలు చేస్తున్న మస్క్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మస్క్ కంపెనీలకు ప్రభుత్వ సబ్సిడీలను తగ్గిస్తామని బెదిరించారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వంటి వివిధ కంపెనీలకు తన సర్కార్ సబ్సిడీలను తగ్గిస్తే “బహుశా దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి సొంతగూటికి వెళ్ళవలసి ఉంటుంది” అని ట్రంప్ ఎద్దేవా చేసారు.
Also Read : కేసీఆర్ కోసమే బీజేపీ నిర్ణయమా..?
దీనిపై మస్క్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. బెదిరింపులకు భయపడే అంత భయస్తుడిని తాను కాదన్నారు. ట్రంప్ తన మాట మీద నిలబడి.. తన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలని డిమాండ్ చేసారు. అక్షరాలా ట్రంప్ ఏం చేయాలనుకున్నారో అన్నీ చేయాలని డిమాండ్ చేసారు మస్క్. మే వరకు ట్రంప్‌కు అధ్యక్ష సలహాదారుగా పనిచేసిన మస్క్ ఆ తర్వాత ట్రంప్ ను విభేదించారు. ఇక ట్రంప్ వార్నింగ్ తో టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్ లు భారీగా తగ్గాయి. ఒకవేళ ఈ బిల్లు కనుక సెనేట్ ఆమోదిస్తే తాను అమెరికా ప్రజల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించిన్ సంచలనం రేపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉందని ప్రకటించారు.