Tuesday, April 7, 2026 08:30 PM
Tuesday, April 7, 2026 08:30 PM

ఏబీఎన్‌పై వైసీపీ దాడి.. దమ్ముంటే రా అంటూ ఆర్కేకు సవాల్..!

హైదరాబాద్‌లోని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇటీవల ఛానల్‌లో ప్రసారమైన వీకెంట్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో వైసీపీ నేతలను, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఆర్టికల్ ప్రసారమైన రెండు రోజుల తర్వాత నిద్ర లేచిన వైసీపీ నేతలు ఓ గంట పాటు ఛానల్ ఎదురుగా బైఠాయించిన నినాదాలు చేశారు. ఏబీఎన్ యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. ఆ న్యూస్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

Also Read : బుమ్రా వర్సెస్ వైభవ్.. ఐపిఎల్ లో ఇంట్రస్టింగ్ పోరు..!

జగన్ చేసిన మావిగన్ ప్రకటనపై వీకెండ్ కామెంట్‌లో ఆర్కే వైసీపీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ నంది అంటే.. వైసీపీ నేతలు కూడా నంది అంటారని.. అలాగే రేపు భవిష్యత్తులో మీ భార్యలను మీ భార్యలు కాదు అంటే.. అవునని గంగిరెద్దుల్లా తలుపుతారని ఎద్దేవా చేశారు ఆర్కే. ఈ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసారమైంది. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ వీడియోలో ఆ క్లిప్ వరకే కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఆర్కే మార్క్ రాడ్ అని బాగా ట్రోల్ చేశారు. దీంతో మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అనే సామెత మాదిరిగా.. ట్రోల్స్‌తో పరువు పోయినట్లు భావించిన వైసీపీ నేతలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఎల్లో మీడియా అంటూ దాని అర్థాన్నే మార్చేసిన వైసీపీ నేతలు.. ఏబీఎన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక ఇప్పటికే రెండుసార్లు అరెస్టు అయి బెయిల్ మీద బయటకు వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి తన నోటికి పని చెప్పారు. “ఏబీఎన్ రాధాకృష్ణా నీ ఆఫీస్ ముందుకు వచ్చాం.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే బయటికి రా! మహిళల్ని అవమానిస్తూ, బూతులు రాసిన రాధాకృష్ణ లెంపలేసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలి.” అంటూ ఇంటి దగ్గర కూర్చుని డిమాండ్ చేశారు. గతంలో సాక్షి అసోసియేట్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్‌ను అరెస్టు చేసినప్పుడు మీడియా స్వేచ్ఛ, మీడియాపై దాడి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఇదే వైసీపీ నేతలు. అమరావతి మహిళలను కించపరిచేలా.. అమరావతిని వేశ్యల రాజధాని అని వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ నేతలు, అమరావతి మహిళా రైతులు సాక్షి కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తే.. మీడియాపై దాడి, ఉక్కుపాదం అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్ పెట్టి వార్తలు ప్రసారం చేశారు. డిబేట్లు కూడా పెట్టారు వైసీపీ అధికారిక న్యూస్ ఛానల్, పత్రికలో. మరి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా మీడియా కార్యాలయం ఎదుట ధర్నాలు చేయడం మీడియాపై దాడి కాదా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

Also Read : ఇరాన్‌ లో ఏం జరుగుతోంది..? అపస్మారక స్థితిలో సుప్రీం లీడర్..?

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు వైసీపీ నేతల తీరును పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఖండించాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే జరిగాయని, ఇలాంటి చర్యలు నేరపూరిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని హోం మంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఏదైనా మీడియా సంస్థ ప్రసారం చేసిన లేదా ప్రచురించిన కంటెంట్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, హింసకు పాల్పడటం కాకుండా, న్యాయపరమైన పరిష్కారం కోరడమే సరైన మార్గమన్నారు. ఈ ఘటన స్పష్టమైన రాజకీయ కక్ష సాధింపు చర్య అని, మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య స్వేచ్ఛపై దాడిగా టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు అభివర్ణించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తమిళనాడులో అలా.. మరి...

చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం...

ఏపీ లిక్కర్ స్కాంలో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం...

కవితను బుజ్జగించేందుకు రంగంలోకి...

బిఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు కల్వకుంట్ల...

అలకపాన్పు ఎక్కిన జమ్మలమడుగు...

గత కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా...

ఇలా అయితే కష్టమే.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

పోల్స్