Sunday, March 22, 2026 10:12 AM
Sunday, March 22, 2026 10:12 AM

వైసీపీ క్యాడర్ లో కేసీఆర్ జోష్.. పండగే..!

వైసీపీలో ఓ డిఫరెంట్ వాతావరణం కనపడుతూ ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వాడు అయినా.. సంబంధం లేని వాడైనా.. ఈ ప్రాంతం వ్యక్తి అయినా.. మరో ప్రాంతం నాయకుడు అయినా సరే.. ఎవరైనా సరే ఏపీ సిఎం చంద్రబాబును, ఆయన కుమారుడు నారా లోకేష్.. సహా టీడీపీ నాయకులు ఎవరిని తిట్టినా సరే సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటూ ఉంటారు. తాజాగా తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్ ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆ మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసారు.

Also Read : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. జగన్ డబుల్ గేమ్..!

సాగునీటి ప్రాజెక్ట్ లు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల వ్యవహారాలు వంటి అంశాలపై కేసీఆర్ విమర్శలు చేసారు. ఈ వీడియోలను పెద్దగా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో రేవంత్ ను తిట్టిన వీడియోలు వైరల్ చేసుకున్నారు. ఏపీ వైసీపీ క్యాడర్ మాత్రం ఆ వీడియోలను పిచ్చ పిచ్చగా వాడుకుంది. తమ అధినేత జగన్ ప్రసంగాలతో నీరసించిపోయిన వైసీపీ క్యాడర్.. కేసీఆర్ మాట్లాడగానే, జగన్ ను లైట్ తీసుకుని వాటిని వైరల్ చేసుకోవడం మొదలుపెట్టింది.

Also Read : ఆటో నగర్ ఫేట్ మారుతోంది.. బెజవాడకు బిగ్ రిలీఫ్

కోటి సంతకాల పేరుతో జగన్.. గవర్నర్ ను కలిసిన తర్వాత ఆ వీడియోలు వైరల్ చేసుకున్నారు వైసీపీ క్యాడర్. స్టఫ్ లేకుండా ఇబ్బంది పడుతూ.. ఆ వీడియోలనే తిప్పుతున్న బులుగు పార్టీకి కేసీఆర్ ఫుల్ జోష్ ఇచ్చారు. పెట్టుబడుల విషయంలో చేస్తున్న ఎంఓయూల గురించి రేవంత్, చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేయగా.. ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, వచ్చిన పెట్టుబడులు ఫేక్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ అనుకూల మీడియా కూడా వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్