Sunday, March 22, 2026 10:08 AM
Sunday, March 22, 2026 10:08 AM

మళ్లీ ఫేక్‌ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్‌ మారడా..??

ఏపీలో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది.. ఏడాదిన్నర పాలనపై ఐఐటీఎన్‌ల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ సర్వేలో సుమారు 40 ప్రశ్నలు సంధించారు.. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున భారీగానే ఈ సర్వే నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రకటించుకుంది.. ఈ సర్వేలో సంధించిన సుమారు 90 శాతం ప్రశ్నలలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు వ్యక్తం అవుతోంది.. ఈ సర్వే వెనక ఆత్మసాక్షి మూర్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆయన ఇటీవల విడుదల చేసిన ఏ ఒక్క సర్వే కూడా నిజం కాలేదు.. దీంతో, ఆత్మసాక్షిని పక్కనపెట్టి ఐఐటీఎన్‌ల సర్వేని తెరమీదకి తెచ్చారనే వాదన ఉంది..

Also Read : పది నిమిషాలు నడిస్తే డైట్ అవసరం లేదా..?

గత ఎన్నికలలో ఆత్మసాక్షి … వైసీపీ పవర్‌లోకి తిరిగి రావడం ఖాయం అని బల్లగుద్దీ మరీ తెలిపింది.. తమ సర్వేలో ఎన్‌డీఏ కూటమి ఓడిపోవడం గ్యారంటీ అని ప్రకటించింది.. ఇటు, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ 3.o అని నొక్కి వక్కాణించింది.. ప్రజల సాక్షిగా తమ ఆత్మసాక్షి అని ఒట్టేసి మరీ తెలిపింది.. కానీ, సీన్‌ రివర్స్‌ అయింది.. దీంతో, ఆత్మసాక్షి క్రెడిబులిటీ దెబ్బతిన్నది.. రూట్‌ మార్చి తాజాగా ఆత్మసాక్షిని పక్కనపెట్టి, ఐఐటీఎన్‌ల ముసుగులో సర్వే చేస్తున్నారని తెలుస్తోంది..

Also Read : అవార్డ్ క్రెడిట్ వాళ్ళదే.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయిన వైసీపీకి, జగన్‌కి ఆత్మవిశ్వాసం కావాలి.. ప్రతిపక్షంలో ఉండి ఆ పార్టీ సరైన పోరాట పంథాని ఎంచుకోలేకపోతోంది.. కూటమి సర్కార్‌ ఇటు సంక్షేమం, అటు అభివృద్ధితో దూసుకుపోతున్నాయి.. ఈ ప్రభావంతో వైసీపీ ఓట్‌ బ్యాంక్‌ మరింత డౌన్‌ అయిందనేది వాస్తవం.. ఇది జనాలకు పక్కాగా తెలుసు..కానీ, తమ ఓటర్లు జంప్‌ కాకుండా, నేతలు పక్క చూపులు చూడకుండా ఉండాలంటే ఆత్మసాక్షిని అమ్ముకొని మరీ చేసే సర్వే రాయుళ్లు కావాలి.. సింపుల్‌గా చెప్పాలంటే గత ఎన్నికలకు ముందు టైమ్స్‌ నౌ చేసిన సర్వేలా ఉండాలి.. అందుకే, ఐఐటీఎన్‌ల పేరుతో చేసిన సర్వే పక్కాగా జగన్‌, వైసీపీ కార్యకర్తలని మోసగించడానికే అనేది నిపుణుల వాదన.. ఇప్పటికే దొంగ, ఫేక్‌ సర్వేలతో ఓడిపోయి, ఆ నెపాన్ని ఈవీఎమ్‌ల మీద నెపం వేసి… ఆత్మవిమర్శ మరిచిన జగన్‌… ఇప్పటికి అయినా కళ్లు తెరుస్తాడేమో చూడాలి..

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్