Sunday, March 22, 2026 03:11 AM
Sunday, March 22, 2026 03:11 AM

టీడీపీ – వైసీపీ మధ్య విమానాల గోల..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వాడీ వేడిగా ఉంది. నిజానికి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ.. విమర్శలు చేయటమే ప్రతిపక్షాల పని. కానీ ఏపీలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కేవలం వ్యక్తిగత దూషణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ విమర్శలు దూషణల స్థాయి కూడా దాటేశాయి. చివరికి వ్యక్తిత్వ హననం వరకు చేరుకున్నాయి. రాజకీయం అంటే అధికారం కాదు.. అది ఒక బాధ్యత అనేది నాటి మాట. ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పదవి అనేది హోదాతో పాటు పెత్తనం చేసేందుకు అనేలా నేటి తరం రాజకీయ పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. గతంలో సరైన రహదారి సౌకర్యాలు లేని రోజుల్లోనే ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా రోడ్డు మార్గంలోనే ఎంత దూరమైన ప్రయాణాలు చేశారు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొణిజేటి రోశయ్య కూడా రైలు ప్రయాణం చేశారు. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీల నేతలకు రైలు, బస్సు అంటే ఏంటో కూడా తెలియదు. లేస్తే కారు.. లేదా విమానం అంటున్నారు. అధికారంలో ఉన్న నేతలైతే ప్రభుత్వ ధనంతో చక్కర్లు కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : బంగారు వర్ణం లో మెరిసిపోతున్న దిశా పటానీ

ఐటీ పరిశ్రమ పుణ్యమా అని వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు. దీంతో నెలకోసారి వీకెండ్‌లో రెండు రోజుల పాటు అలా అలా ఓ ట్రిప్‌కు వెళ్లి.. సరదాగా రిఫ్రెష్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే విధానం అనుసరిస్తున్నారు ఏపీలోని రాజకీయ నేతలు. హైదరాబాద్ నుంచి అమరావతికి కార్యాలయాలు మారిన కొత్తల్లో ఉద్యోగుల కుటుంబాలు భాగ్యనగరంలో ఉన్నందున వారానికి 5 రోజులే పని దినాలని నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ అదే విధానం అమలు చేస్తోంది. దీంతో శని, ఆదివారాల్లో కింది స్థాయి ఉద్యోగులు మొదలు ఉన్నతాధికారుల వరకు అంతా హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. దీంతో సచివాలయానికి తాళం వేయాల్సి వస్తోంది. ఉద్యోగులు లేకపోతే మనమెందుకనుకున్నారో ఏమో.. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు.

Also Read : ఆర్థిక ఉగ్రవాది బల ప్రదర్శన..!

ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ అయితే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. దీనిపైనే ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. వీకెండ్ పొలిటిషన్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ముగ్గురు నేతల్లో చంద్రబాబు ఇల్లు మాత్రమే అమరావతిలో నిర్మాణం అవుతోంది. పవన్ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోనే ఉండటంతో వీళ్లు ముగ్గురు ప్రతి వారం హైదరాబాద్ వెళ్తున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. సొంత రాష్ట్రంలో ఉండాల్సిన నేతలు ఇలా పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ.

Also Read : షమీకి ఫోన్ చేయలేరా..? సెలెక్టర్ లపై మాజీ క్రికెటర్ ఫైర్..!

దీనికి కూటమి నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలి‌కి కూడా హెలికాఫ్టర్‌లో వెళ్లిన విషయం మర్చిపోయారా అంటున్నారు. గన్నవరం నుంచి తిరుపతికి వయా హైదరాబాద్ ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీస్తున్నారు. కుటుంబంతో సహా యూరప్ పర్యటన వెళ్లినప్పుడు విమాన ఖర్చులు ఎవరి భరించారో వైసీపీ నేతలు లెక్కలు వెల్లడించాలన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతోనే తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్‌ రిపేరు చేయించారని.. ఈ విషయం వైసీపీ నేతలకు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి టీడీపీ వైసీపీ నేతల మధ్య విమానాల ఖర్చుల లెక్క పెద్ద దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో రాజకీయం చేసే వాళ్లు.. ఆ రాష్టంలోనే ఉంటే.. ఈ సమస్య రాదు కదా అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్