Sunday, March 22, 2026 09:31 AM
Sunday, March 22, 2026 09:31 AM

జగన్ కొత్త టార్గెట్.. ఆరు నెలలకు రూట్ మ్యాప్ రెడీ..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎప్పుడు బయటకు వస్తారు అనేదానిపై ఆ పార్టీ కార్యకర్తలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరుకు పరిమితమైన జగన్ ఆ తర్వాత పెద్దగా బయట కనపడలేదు. అప్పుడప్పుడు పర్యటనలు చేస్తున్నప్పటికీ ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురాలేకపోతున్నారు. అటు పార్టీ నాయకత్వం కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఏదో జగన్ కనబడినప్పుడు నాయకులకు కనపడుతున్నారు మినహా క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా నాయకులు.. ఉత్సాహంగా ఉండటం లేదు.

Also Read : ప్రపంచ క్రికెట్‌ ను శాసించే స్థాయిలో కొత్త స్టేడియాలు..!

అయితే ఇప్పుడు జగన్ కొత్త వ్యూహంతో రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. బెంగళూరులో ఉంటున్న జగన్ పక్క వ్యూహంతో సంక్రాంతి తర్వాత నుంచి ఓ ప్రణాళిక ప్రకారం వెళ్లే ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆరు నెలలపాటు జగన్ ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలపాటు అన్ని జిల్లాల్లో పర్యటించాలని.. ఇందుకు విరామం ఇవ్వకూడదని.. బహిరంగ సభలు కూడా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారట. 2029లో అధికారంలోకి రాకపోతే పార్టీ మరింత బలహీన పడిపోతుందని ఆవేదన జగన్ లో ఎక్కువగా ఉంది. అందుకే ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో జగన్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read : బెజవాడ నుంచి అమరావతి వెళ్ళే వారికి గుడ్ న్యూస్..!

ఉత్తరాంధ్రతో మొదలుపెట్టి కుప్పం వరకు జగన్ పర్యటనలు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పార్టీలోని కీలక నాయకులు ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నమ్మకమైన నాయకులను రంగంలోకి దించాలని కూడా జగన్ భావిస్తున్నారట. ఇదే సమయంలో పార్టీ ప్రక్షాళన కార్యక్రమాలు కూడా నిర్వహించి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ముందుగానే ఖరారు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీ క్యాడర్ నిస్తేజంగా ఉంటే భవిష్యత్తుపై దెబ్బ పడుతుందని ఆవేదన జగన్ లో కనపడుతోంది. అందుకే తాను స్వయంగా రంగంలోకి దిగితే కేసులకు భయపడుతున్న నాయకులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని భావనలో వైసీపీ అధినేత ఉన్నారట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్