Wednesday, February 4, 2026 07:02 PM
Wednesday, February 4, 2026 07:02 PM

నా కోసం స్పెషల్ ఏర్పాట్లు..!

నేను కోర్టుకు రావాలంటే.. చాలా ఇబ్బందులున్నాయి.. నాకు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇది ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. కాబట్టి నేను కోర్టుకు రాలేను సార్.. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ.. కావాలంటే.. జూమ్ మీటింగ్‌లో హాజరవుతా.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. చట్టం, న్యాయం అంటే గౌరవం ఉంది.. అని పదే పదే చెప్పే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ దాఖలు పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Also Read : ఎమ్మార్వో ఆఫీస్ కు మాగంటి ఫ్యామిలీ పంచాయతీ..!

ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన ప్రధాన ఆరోపణ. ఈ కేసులోనే జగన్ ఇప్పటికే 16 నెలల పాటు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా జైలు జీవితం అనుభవించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే వందల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ కేసు విచారణ దశాబ్దానికి పైగా కొనసాగుతోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ మీద బయట ఉన్నారు. గతంలో ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా జగన్ ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. సీఎంగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సాకుగా చూపించి వాయిదాలకు హాజరు నుంచి మినహాయింపు పొందారు.

సుదీర్ఘంగా జరుగుతున్న జగన్ అక్రమాస్తుల కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణలు త్వరగా పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలని ట్రయల్ కోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఇటీవల జగన్ లండన్ టూర్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు… తిరిగి తర్వాత నవంబర్ 14న వ్యక్తిగతంలో కోర్టులో హాజరవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూరప్ టూర్ ముందు కోర్టు ఆదేశాలకు సరే అని అంగీకరించిన జగన్.. ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 14వ తేదీన స్వయంగా కోర్టుకు జగన్ హాజరవ్వాల్సి ఉంది. సరిగ్గా వారం రోజుల ముందు కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌లో జగన్ కోరారు. ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాను కోర్టుకు రావాలంటే.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని.. భద్రతా కారణాలున్నాయని ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు ప్రభుత్వానికి భారమన్నారు. కాబట్టి తప్పనిసరిగా హజరవ్వాలని కోర్టు భావిస్తే.. తప్పనిసరిగా వస్తానన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకుని హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు.

Also Read : టి20 ప్రపంచ కప్ డేట్స్ ఇవే.. పాక్ మ్యాచ్ లు అక్కడే..!

నిజానికి 2012 నుంచి జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ఇప్పటికీ పూర్తి చేయలేదు. డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం వల్లే విచారణ పూర్తి కావటం లేదని సుప్రీంకోర్టుకు దర్యాప్తు సంస్థలు తెలిపాయి కూడా. అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్.. కోర్టుకు హాజరైతే.. విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనేది న్యాయ నిపుణుల మాట. కానీ జగన్ మాత్రం.. లేని ముప్పును సాకుగా చూపించి.. ప్రత్యేక భద్రత కావాలని.. పిటిషన్ దాఖలు చేయడం చూస్తుంటే.. కేసు విచారణ ముందుకు సాగకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్