Saturday, October 18, 2025 09:57 PM
Saturday, October 18, 2025 09:57 PM
roots

ఫ్యాన్స్ కు కోహ్లీ మరో షాక్..?

టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ కు కూడా గుడ్ బై చెప్పేసాడా..? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. గత కొన్నాళ్ళుగా విరాట్ కోహ్లీ క్రికెట్ వీడ్కోలుకు సంబంధించి అనేక వార్తలు చూస్తూనే ఉన్నాం. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతను తప్పుకునే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. గత ఏడాది టి20 ప్రపంచ కప్ అనంతరం టి20 లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ, ఈ ఏడాది వేసవిలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు కోహ్లీ ఐపిఎల్ విషయంలో కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు తమన్ అదిరిపోయే గిఫ్ట్.. బాక్సులు బద్దలే..!

ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేలు ఆడనున్న కోహ్లీ.. జనవరి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో దేశవాళి క్రికెట్ లో విజయ్ హజారే ట్రోఫీ ఆడే అవకాశం కూడా ఉంది. ఇక ఆ తర్వాతి నుంచి అతను పూర్తిగా గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్టు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఐపిఎల్ విషయంలో కూడా కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆర్సీబీ యాజమాన్యం కోహ్లీని సంప్రదించగా.. కాంట్రాక్ట్ వదులుకుంటాను అని, తాను కొనసాగలేను అని చెప్పినట్టు సమాచారం.

Also Read : కల్తీ మద్యం విషయంలో కూటమి నాయకులు బోల్తా..? మద్దతు ఎక్కడ..?

మొదటి అదే జట్టుకు ఆడుతున్న కోహ్లీని ప్రతీ ఏటా ఆర్సీబీ యాజమాన్యం రిటైన్ చేసుకుంటుంది. ఆ జట్టుకు ఆ స్థాయి ఫాలోయింగ్ ఉందీ అంటే కోహ్లీనే కారణం. గత ఏడాది తొలిసారి 18 ఏళ్ళ తర్వాత ఐపిఎల్ ట్రోఫీ గెలిచింది ఆర్సీబీ. ఆ సమయంలో కాస్త ఇబ్బందికర ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అప్పుడు కోహ్లీని కూడా మీడియా టార్గెట్ చేసిన పరిస్థితి. ఇటు బోర్డు నుంచి కూడా కోహ్లీకి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనితోనే కోహ్లీ ఐపిఎల్ విషయంలో కూడా దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్