రెండు ప్రాంతాల మధ్య నీరు అనే అంశం ఎప్పుడూ సున్నితమే. దీనిపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి నదీ జలాల వివాదం, ఏపీ తెలంగాణా మధ్య కృష్ణా నదీ జలాల వివాదం ఎప్పుడూ సంచలనమే. తెలంగాణా రాష్ట్ర డిమాండ్ లో కీలక పాత్ర పోషించిన వాటిలో జలాలు కూడా ఉన్నాయి. 2014 లో రెండు రాష్ట్రాలు విడిపోగా.. నాటి నుంచి కృష్ణా యాజమాన్య బోర్డు వేదికగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది.
Also Read : బంగ్లాదేశ్ తో క్రికెట్ క్యాన్సిల్..? బీసీసీఐ సంచలన నిర్ణయం..?
తెలంగాణా అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓ కామెంట్ చేసారు. 2019 తర్వాత నాటి ఏపీ సిఎం జగన్ మొదలుపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.. ప్రస్తుత ఏపీ సిఎం చంద్రబాబు.. తాను అడిగితే పనులు ఆపివేయించారు అంటూ మాట్లాడారు. ఈ కామెంట్ ఒక్కసారిగా ఏపీని కుదిపేసింది. వాస్తవానికి 2020 లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా మొదలుపెట్టడంతో కేంద్రం ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వాలని ఇచ్చింది. దీనితో అప్పటి సర్కార్ పనులు నిలిపివేసింది.
Also Read : క్యాలెండర్ ఇయర్ లో 2 వేల కోట్లు.. స్టార్ హీరోలకు సాధ్యం కాని రికార్డ్..!
దీనిపై చంద్రబాబును రేవంత్ విమర్శించకపోయినా.. రేవంత్ కామెంట్ మాత్రం చంద్రబాబు సర్కార్ ను ఇబ్బంది పెట్టింది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. చంద్రబాబుతో స్నేహం కోసమే రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అటు సేటిలర్ల ఓట్ల కోసం కష్టపడుతున్నారు. చంద్రబాబు విషయంలో దూకుడుతోనే బీఆర్ఎస్ నష్టపోయిందనే భావన కూడా రేవంత్ లో ఉంది. ఇక్కడ చంద్రబాబు గనుక లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో సోందిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే సిఎం స్పందించే అవకాశం లేదని, అందుకే మంత్రి సవితతో కామెంట్ చేయించి ఉండవచ్చు అనే అభిప్రాయం సైతం వినపడుతోంది. ఇక ఈ అంశంలో టీడీపీ నాయకత్వం గాని, టీడీపీ క్యాడర్ గాని దూకుడుగా రేవంత్ పై విమర్శలు చేయడం లేదు.

