Wednesday, February 4, 2026 10:50 AM
Wednesday, February 4, 2026 10:50 AM

బీజేపి చీఫ్ ఆయనే..? కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు..!

బీహార్ ఎన్నికలతో మరోసారి ఎన్డియే శక్తివంతమైన కూటమిగా అవతరించింది. రాజకీయంగా ఏ సవాల్ అయినా స్వీకరిస్తామని ధైర్యంగా బరిలోకి దిగిన కమలం పార్టీ పెద్దలు.. బీహార్ గడ్డపై భారీ మెజారిటీ తో తిరిగి అధికారాన్ని చేపడుతున్నారు. మరి ఇప్పుడు తదుపరి వ్యూహాలు ఏంటీ..? బిజెపి అధిష్టానం ఏ దిశగా అడుగులు వేస్తుంది..? కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టినట్టు చెప్తున్నాయి.

Also Read : పరకామణి కేసు: హైకోర్ట్ సంచలన ఆదేశాలు

కేంద్ర మంత్రి వర్గంలో మార్పులతో పాటుగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది బిజెపి. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ముగ్గురి పేర్లను పరిశీలిస్తోంది. ఒడిస్సాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మధ్యప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానాకు చెందిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లలో ఒకరిని బిజెపి అధ్యక్షుడిగా ఎంపిక చేసే అడుగులు వేస్తోంది. వీరిలో ప్రధాన్ కు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే మాట బలంగా వినపడుతోంది.

Also Read : మావోయిస్టుల అరెస్టుపై పోలీసుల సంచలన ప్రకటన.. అందుకే బెజవాడ వచ్చారా..?

కాని.. ఖట్టర్, చౌహాన్ ఇద్దరూ కేంద్ర మంత్రులుగానే కాకుండా ముఖ్యమంత్రులుగా పని చేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు. తమ తమ రాష్ట్రాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. దీనితో వారి విషయంలో సంఘ్ పరివార్ ఆసక్తిగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జెపి నడ్డా.. 5 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు. దీనితో మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఎలా ఉన్నా డిసెంబర్ 1 లోపు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక పూర్తి చేయాలని బిజెపి భావిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చే అడుగులు వేస్తోంది అధిష్టానం. తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, ఇదే సమయంలో తెలంగాణాలో బలం పెంచుకోవాలని పట్టుదలగా రాజకీయం చేస్తోంది. అందుకే తమిళనాడు నుంచి ఇద్దరు, తెలంగాణా నుంచి మరొకరిని కేంద్ర కేబినేట్ లోకి తీసుకుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్