Sunday, February 22, 2026 05:14 AM
Sunday, February 22, 2026 05:14 AM

అనంతబాబును కాపాడుతున్నది ఎవరూ..?

దళిత డ్రైవర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కూటమి ప్రభుత్వం కాపాడుతుందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న బాగా వినిపిస్తోంది. ప్రతిపక్షంతో అలా.. అధికార పక్షంతో ఇలా.. అప్పుడేమో దళిత వ్యక్తిని హత్య చేసి డోరు డెలివరీ చేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును, జగన్ రెడ్డి కాపాడుతున్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. మరి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది. ఈ కేసుపై గతేడాది మార్చి నెల నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు ఎన్నోసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ అనంతబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి సుప్రీం కోర్టు సీరియస్ అయిన తర్వాతే పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు.

Also Read : పరారీలో వైసీపీ ఎమ్మెల్సీ..!

ఇప్పుడు అనంతబాబును ఎవరెవరు, ఏయే కారణాలతో కాపాడుతున్నారు..? అప్పట్లో అరిచి గోల చేసిన వారంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అప్పుడు చేసిన వాడీ, వేడీ విమర్శలు, ఆరోపణలు.. ఇప్పుడు చల్లబడ్డాయా..? తాజాగా పోలీసులపై సుప్రీం కోర్టు చేసిన కామెంట్లు.. వారి కన్నా పాలకులకే ఘాటుగా తగిలాయన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అనంతబాబు దర్జాగా తిరుగుతున్నా కూడా.. దళిత మహిళా హోం మంత్రి వంగలపూడి అనిత కానీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కానీ అనంతబాబు విషయంలో సీరియస్‌గా లేరన్న విమర్శలు వస్తున్నాయి.

తాజా అంశం ఏమిటంటే.. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆ కేసు నీరుగారుస్తున్నారన్న అనుమానమే. ఇంతకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఎవరు రక్షిస్తున్నారు..? కాపు కులానికి చెందిన అనంతబాబును ఒక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెర వెనకుండి కాపాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు పొలిటికల్ సర్కిల్‌లో కూడా ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. అనంతబాబు కేసును లైట్ తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంది ఎవ్వరు..?

Also Read : బరువు తగ్గే వాళ్ళు ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి..?

దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ కేసులో అనంతబాబు అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలి హోదాలో వంగలపూడి అనిత స్వయంగా కాకినాడ వెళ్లి ధర్నాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై దుమ్మెత్తి పోశారు. ప్రస్తుతం ఆ అనిత గారే ఇప్పుడు హోం మంత్రిగా వున్నారు. అప్పట్లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య పై పలు సందర్భాల్లో, ఎన్నికల ప్రచారంలో ఎన్నోసార్లు ప్రస్తావించిన చంద్రబాబు, పవన్, లోకేష్ ఇప్పుడు ఆదేశించే స్థాయిలో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత డ్రైవర్ హత్య కేసు పై ప్రత్యేక దృష్టి పెట్టేలేదనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి.

ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. కూటమి ప్రభుత్వంలో చలనం కలుగుతుందా..? అనే అనుమానాలు ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్నాయి. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని.. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షిట్ దాఖలు చేశారని కోర్టు తెలిపింది. అప్పుడు తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కూడా కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీలు ఏమి చేస్తున్నారని కోర్టు నిలదీసింది. తాజాగా పోలీసులు నిందితునితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎక్కడో ఏదో జరుగుతోందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. హత్య చేసినప్పుడు, గోల చేసిన వారంతా ప్రస్తుతం మౌనంగా ఉండటంలో మర్మమేమిటి..? చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుంటే తప్ప, పాలకులు పట్టించుకోరేమో..!

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జీవితంలో రెండో ఇన్నింగ్స్...

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్...

బిఆర్ఎస్ తో బిజెపి...

సాధారణంగా రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల...

నాటకాల రాయుళ్లది రోజుకో...

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ...

చెప్తే అర్ధం కాదా..?...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల విషయంలో కూటమి...

చెవిరెడ్డిని ఊహించని దెబ్బ...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా...

ఏకంగా రూ.70 వేల...

దేశంలోనే అతి పెద్ద స్కామ్ వెలుగులోకి...

పోల్స్