Wednesday, February 4, 2026 08:20 AM
Wednesday, February 4, 2026 08:20 AM

బెంగళూరు అంకుల్ ఎక్కడ..? సోషల్ మీడియాలో రచ్చ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడున్నారు..? ఆయనకు ఏమైంది..? అంతా క్షేమమే కదా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్నాయి. అసలు ప్రశ్నలు వేస్తుంది ఎవరా అని ఆరా తీస్తే.. ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రశ్నలను తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు వేయలేదు. వైసీపీ నేతలే తమ పార్టీ అధినేత ఎక్కడున్నారంటూ సీనియర్ నేతలను ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు విషయం తెలియక.. సీనియర్లు కూడా సైలెంట్‌గా సైడ్ అవుతున్నారు.

భారతదేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ జెండా వందనం చేశారు. రాజకీయాలకు అతీతంగా అంతా జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్రపతి మొదలు.. గవర్నర్లు, కలెక్టర్లు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు జెండా వందనం చేశారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అయితే ఒక్కరు మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే జెండా వందనం చేస్తున్న ఫోటో కూడా బయటకు రాలేదు.

Also Read : జగన్‌కు నిజంగానే షాక్ ఇస్తారా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జెండా వందనం జరిగింది. టీడీపీ కార్యాలయంలో పల్లా శ్రీనివాస్, జనసేన పార్టీ ఆఫీస్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజీపీ ఏపీ శాఖలో మాధవ్ జెండా వందనం చేశారు. కానీ వైసీపీ కార్యాలయంలో మాత్రం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఎగుర వేశారు. సాయంత్రం లోక్ భవన్‌లో గవర్నర్ నిర్వహించిన హై టీ కార్యక్రమానికి కూడా వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. దీంతో అసు జగన్ ఎక్కడున్నారనే ప్రశ్న తలెత్తింది. ఇదే సమయంలో జగన్‌కు దేశ భక్తి ఉందా అని కూడా సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

జగన్ తీరుపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే జగన్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా జగన్ పాల్గొనటం లేదు. ర్యాలీలు, ధర్నాలు చేయాలని చెబుతున్నారు తప్ప.. ఎక్కడా ఆయన కనిపించటం లేదు. దేశమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే.. జగన్ మాత్రం బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లో ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కరోనా సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంట్లో జెండా వందనం చేశారు. కానీ జగన్ మాత్రం ఇంట్లో కూడా జెండా వందనం చేసినట్లు లేదు. మాజీ ముఖ్యమంత్రి దేశభక్తి ఇదేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవి ఉంటేనే జెండా ఎగురవేస్తారా.. లేదంటే.. జాతీయ పతాకానికి కనీసం వందనం కూడా చేయరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఆ పోస్టు మళ్లీ ఆయనకే ఎందుకు సార్..?

ఇక జగన్ గురించి సోషల్ మీడియా అంతా దుమ్ము రేగిపోయింది. #WhereIsBangaloreUncle అంటూ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ పూర్తిగా యలహంక ప్యాలెస్‌కే పరిమితం అయ్యారు తప్ప.. కార్యకర్తల ముఖం కూడా చూడటం లేదు. వారంలో రెండు రోజులు మాత్రం తాడేపల్లికి వచ్చి.. ఎంపిక చేసిన నేతలతో నాలుగు మాటలు చెబుతున్నారు. అలాగే నెలకోసారి తాను మెచ్చిన, తన మాటకు ఎదురు చెప్పని పాత్రికేయులతో సమావేశం నిర్వహించి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారు. దీంతో వైఎస్ జగన్‌ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు కూడా జగన్ దూరంగా ఉండటంతో.. ఇలాంటి నేత మరెక్కడా ఉండడంటూ సైటైర్లు వేస్తున్నారు. దేశం పట్ల జగన్ చూపిస్తున్న ప్రేమకు తప్పకుండా శాలువా కప్పి సన్మానించాల్సిందే.. అంటూ పాత వీడియోలు ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్