Sunday, March 22, 2026 01:19 PM
Sunday, March 22, 2026 01:19 PM

కోహ్లీని చూస్తే చాలనుకున్నా.. కానీ.. తెలుగు క్రికెటర్ సంచలన కామెంట్స్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న ఆటగాళ్లు. మైదానంలో వాళ్లను చూస్తే చాలు.. అనుకునే అభిమానులు ఎందరో ఉంటారు. అలాగే యువ క్రికెటర్లు కూడా వాళ్లను ఆరాధిస్తూ ఉంటారు. క్రికెట్ లో వాళ్లను చూసి నేర్చుకుని, రాణించే ఆటగాళ్లు భారత్ సహా విదేశాల్లో కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఇద్దరూ కెరీర్ చివరి దశలో ఉండటంతో.. వాళ్ళ ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఇదే సమయంలో వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడాలని యువ ఆటగాళ్లు సైతం పోటీ పడుతున్నారు. ఇప్పుడు వాళ్లకు విజయ్ హజారే ట్రోఫీ పుణ్యమా అని అదిరిపోయే అవకాశం వచ్చింది.

Also Read : Sharvari Wagh : శార్వరీ వాఘ్

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు 15 ఏళ్ల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ రెగ్యులర్ గా ఆడటంతో.. కొత్త ఆటగాళ్లు పండగ చేసుకుంటున్నారు. మొన్న ఆంధ్ర తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. అలాగే సిక్కింతో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఆడాడు. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. మ్యాచ్ చూడటానికి అభిమానులు భారీగా తరలిరాగా.. వాళ్లతో కలిసి ఆడిన ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సెల్ఫీలు తీసుకున్నారు. ఇద్దరితో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. తమ జెర్సీల మీద ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు.

Also Read : తమ సత్తా ఏంటో చూపించిన రోకో..!

దీనిపై ఆంధ్రకు చెందిన ఓ ఆటగాడు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వినయ్ కుమార్ అనే క్రికెటర్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదు అన్నాడు. తాను కోహ్లీని కలవాలని, లేదా దగ్గరగా చూడాలని కలలు కన్నానని, కానీ ఆ అవకాశం తనకు ఎప్పుడూ రాలేదన్నాడు.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో వచ్చిందని పొంగిపోయాడు. జీవితంలో ఒక్కసారి లభించే అవకాశం గా చెప్పుకున్నాడు. తాను అద్భుతమైన సెంచరీ చేయడం చూశానని, విరాట్ కోహ్లీలో ప్రతి షాట్ ను దగ్గరగా చూసానని చెప్పుకొచ్చాడు. ఇది తన జీవితకాల జ్ఞాపకం అంటూ పొంగిపోయాడు ఈ కొత్త ఆటగాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్