సాధారణంగా ఎక్కడైనా చిచ్చు పెట్టాలి అన్నా, ఎవరి మధ్యలో అయినా చిచ్చు పెట్టాలి అంటే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిది అందే వేసిన చేయి. పచ్చని కాపురంలో నిప్పులు పోశారు అనే డైలాగ్ మనం సినిమాల్లో, సమాజంలో వింటూ ఉంటాం. ఈ డైలాగ్ రాజకీయాల్లో వాడితే విజయసాయి రెడ్డి కోసమే రాసినట్టు ఉంటుందేమో అనే డౌట్ వస్తూ ఉంటుంది. విజయసాయి రెడ్డి రెండు రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కురిపిస్తున్న సానుభూతి, సంధించిన ప్రేమ బాణాలు, గురిపెట్టిన ఆప్యాయ తూటాలు చూస్తుంటే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్దమైన వాసిరెడ్డి
ఒకవైపు చంద్రబాబును పవన్… మీరే పదేళ్ళు సీఎం అంటున్నారు. మరో వైపు పవన్ కు కేంద్రంలో బిజేపి పెద్దలు రెడ్ కార్పెట్ పరిచారు. కాబోయే ప్రధానిగా లిస్టులో ఫస్ట్ ఉన్న హోం మంత్రి అమిత్ షా అయితే పవన్ ను క్రౌడ్ పుల్లర్ అంటూ ఆకాశానికి ఎత్తేసారు. ఇక షర్మిల కూడా తమను గట్టిగా కుడి చేత్తో గిల్లుతూ కూటమిని మాత్రం ఎడమ చేత్తో జాగ్రత్తగా చరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు సెక్యూరిటీ బాధ్యత మాదే అని పవన్ అనడం… అటు వైపు రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ లో బలంగా ఉండటం… ఇవన్నీ చూసి జగన్ కు చెమటలు పడుతున్నాయి. అందుకే కూటమి కొంపలో కుంపటి అనే కార్యక్రమానికి తెర తీసింది వైసీపీ అధిష్టానం.
Also Read: అక్రమ దందా.. ఎస్పీపైనే అనుమానాలు అన్నీ…?
అప్పట్లో సోము వీర్రాజుకు ఇడ్లీలు పెట్టి దగ్గర చేసుకున్న వైసీపీ నేతలు… ఇప్పుడు పవన్ కు మాత్రం ప్రేమ బాణాలు వేయడం మొదలుపెట్టారు. నీ శాఖలను చంద్రబాబు తిడుతున్నాడని, నీ అధికారుల తప్పులనే మాట్లాడుతున్నాడని… నిన్ను వాడుకుని వదిలేస్తున్నాడని ఎక్స్ లో వరుసగా పోస్ట్ లు చేయడం మొదలుపెట్టాడు సాయిరెడ్డి. అసలు ఎన్డియేలో నిన్ను మించిన తోపు ఎవడూ లేడు అని… నీది ఉరకలు వేసే యువ రక్తం… నువ్వే సీఎం కావాలి అంటూ పవన్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయి రెడ్డి. పవన్ కు చంద్రబాబుకు మధ్య లేని గ్యాప్ ను క్రియేట్ చేయడానికి విజయసాయి రెడ్డి ఎక్స్ నుంచి పునాదులు వేయడం మొదలుపెట్టారు. ఎంతైనా పుట్టుకతో వచ్చిన బుద్దులు ఎక్కడికి పోతాయి చెప్పండి.

