ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి విచారణ ఎప్పటికప్పుడు ఆసక్తిని రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపధ్యంలో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతీ వ్యాపార వ్యవహారాలను చూస్తే బాలాజీ గోవిందప్పకు హైకోర్ట్ బెయిల్ రద్దు చేసింది.
Also Read : ఏదైనా చేసుకోండి.. ఐబొమ్మ రవి సంచలన కామెంట్..!
ఇక ఇప్పుడు ఈ కేసులో కీలకంగా ఉన్న కొందరు నిందితులు అప్రూవర్ గా మారడం గమనార్హం. అప్రూవర్లుగా మారినట్లు హైకోర్టుకు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ అమలులో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్.. అప్రూవర్ గా మారడంతో రాజకీయ వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాయి. వైసీపీ హయాంలో బేవరేజెస్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ ఆదేశాలతోనే కొన్ని కీలక ఒప్పందాలు జరిగినట్టు కూడా సిట్ తేల్చింది.
Also Read : ఓట్స్ తింటే నిజంగానే బరువు తగ్గుతారా..?
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో లిక్కర్ స్కాం నిందితులుగా ఇంకెంతమంది బయటపడతారా అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసులో వైసీపీ అగ్ర నేతలను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనితో విచారణ తాడేపల్లి ప్యాలెస్ తలుపు తీసే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అరెస్ట్ లతో తాము ఎవరిని అయినా అరెస్ట్ చేస్తామని సిట్ క్లారిటీ ఇచ్చింది. దీనితో మాజీ సిఎం వైఎస్ జగన్ ను కూడా విచారించే అవకాశాలు కనపడుతున్నాయి.

