Monday, April 6, 2026 08:12 PM
Monday, April 6, 2026 08:12 PM

భారత్ కు ఇరాన్ తలనొప్పి..? ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్..?

మధ్యప్రాచ్యంలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ద తీవ్రత గల్ఫ్ దేశాలతో పాటుగా యూరప్ దేశాలను కలవరపెడుతోంది. మధ్యప్రాచ్యంలో తమ మాట వినని ఇరాన్ విషయంలో అమెరికా సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం.. ఇరాన్ సమీపానికి యుద్ద నౌకలు చేరుకున్నాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇరాన్ తీర ప్రాంతానికి కేవలం.. దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ చేసారు.

Also Read : ఆ నేతకు బ్రేకులు ఎందుకు వేయలేకపోతున్నారు..?

మరో యుద్ద నౌక ఇరాన్ కు సమీపంలోనే ఉండవచ్చు అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ రిపబ్లిక్‌ ను నాశనం చేయడంలో అమెరికన్ సైనిక బలం విజయం సాధించే అవకాశం లేదన్నారు. ఒక అమెరికన్ యుద్ధనౌక మునిగిపోవచ్చని కూడా హెచ్చరించడం గమనార్హం. ఆ రెండు సంకేతాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో, ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. రెండు దేశాల మధ్య రాజీ కోసం జెనీవా కేంద్రంగా చర్చలు జరుపుతోంది.

Also Read : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..?

ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాలో అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలోని కొన్ని భాగాలను ఇరాన్ సర్కార్ తాత్కాలికంగా మూసివేయడంతో ఆందోళన మొదలైంది. 60 శాతం చమురు ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. మూసివేత దీర్ఘకాలికంగా కొనసాగితే భారత్ సహా పలు దేశాల ఆయిల్ ధరలపై ప్రభావం పడుతోంది. 1980ల నుంచి ఇప్పటి వరకు మూసివేయలేదు. ఆసియా మార్కెట్ లపై దీని ఎఫెక్ట్ ఎక్కువ. ఇజ్రాయిల్ తో యుద్ధం సమయంలో కూడా ఈ జల సంధిపై ఆందోళన వ్యక్తమైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే కష్టమే.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

ఏపీలో మరో రేపిస్ట్...

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం...

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

పోల్స్