Sunday, March 22, 2026 07:07 AM
Sunday, March 22, 2026 07:07 AM

విజయ్ ను సిబిఐ ఏం అడిగింది..?

టీవీకే చీఫ్ విజయ్ రాజకీయ ప్రవేశం ఏమో గాని ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. కరూర్ ఘటన తర్వాత విజయ్.. అంతర్గతంగా పడుతున్న ఇబ్బందులు మాత్రం ఆయన ఫ్యాన్స్ ను, ఆ పార్టీ నేతలను భయపెడుతున్నాయి. ఇటీవల ఆయనను ఢిల్లీ సిబిఐ కేంద్ర కార్యాలయానికి రావాలి అంటూ సిబిఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనితో విజయ్ విచారణకు హాజరు అయ్యారు. దీనిపై రాజకీయ పక్షాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

Also Read : వందే భారత్ స్లీపర్ ట్రైన్ చార్జీలు, షాకింగ్ ప్రత్యేకతలు ఇవే..!

ఇటీవల ఆయన సినిమా విషయంలో పరిణామాలు గాని.. ఇప్పుడు కరూర్ ఘటన విషయంలో సిబిఐ విచారణ గాని ఏం జరుగుతుందా అనే ఆసక్తిని పెంచేశాయి. ఇక సిబిఐ అధికారులు నిన్న సుమారు 6 గంటల పాటు టీవీకే చీఫ్ విజయ్ ను విచారించారు. విచారణలో ఈ కింది అంశాలపై స్పష్టమైన డాక్యుమెంట్లు, వివరాలు కోరినట్లు తెలుస్తోంది. అనుమతుల ఆధారాలు – కార్యక్రమానికి తీసుకున్న అన్ని అధికారిక అనుమతులు అడిగినట్లు తెలుస్తోంది. జనం సంఖ్య & క్రౌడ్ కంట్రోల్ వ్యూహం – అంచనా వేసిన హాజరు, నియంత్రణ ప్రణాళిక కూడా అడిగారు.

Also Read : ట్రాఫిక్ చలానాలపై కఠినత్వం.. రేవంత్ పై విమర్శల వెల్లువ

అధికారులతో సమన్వయం వివరాలు – పోలీస్, జిల్లా యంత్రాంగంతో జరిగిన సమన్వయం సహా పలు వివరాలు అడిగారు. భద్రత & సెక్యూరిటీ చర్యలు – తీసుకున్న భద్రతా ఏర్పాట్ల పూర్తి వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. ఖర్చులకు సంబంధించిన డాక్యుమెంట్లు – ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్ల వ్యయాలు, మొత్తం మీద, ఈవెంట్ ప్లానింగ్ నుంచి అమలు వరకూ ప్రతి అంశంపై స్పష్టత కోరుతూ విజయ్ కు సిబిఐ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మళ్ళీ విచారణకు పిలుస్తామని కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్