వైకుంఠ ద్వారా దర్శనాల నేపధ్యంలో టీటీడీ అధికారులు ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు చేపట్టారు. గతంలో జరిగిన ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. దర్శనాల విషయంలో టికెట్ ల జారీ సహా పలు నిర్ణయాలను అమలు చేసింది. ముందు మూడు రోజులు.. టికెట్ లు ఉన్న భక్తులకే దర్శనం ఏర్పాటు చేయగా.. తర్వాత 2 నుంచి ఏడవ తేదీ వరకు టికెట్ లు లేని వారికి కూడా దర్శనం చేసుకోవచ్చు అని ప్రకటన చేసింది. భక్తుల తాకిడి ఎంత ఉన్నప్పటికీ.. ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టింది.
Also Read : బీసీ నేతకు షాక్ ఇచ్చింది బీసీ ఓటర్లే నా!!
సెలవలు కావడంతో గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఇక ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి సామాన్య భక్తులకు అరుదైన అవకాశం కల్పించింది. సాధారణంగా అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులకు అవకాశం ఉండదు. కానీ.. శ్రీవారి అభిషేక సేవ జరుగుతుండగా సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు అధికారులు. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్
నేటి నుంచి టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న టీటీడీ.. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. పాచికాలవ గంగమ్మ ఆలయం నుంచి గోగర్భం క్యూలైన లోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. వేకువజామున ‘తిరుప్పావై’ సేవ అనంతరం తిరుమలలో సర్వదర్శనాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. అభిషేక సేవ సమయంలో దర్శనం కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

