గత కొన్నాళ్ళుగా వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన కొన్ని రోజుల తర్వాత, ఇమ్మిగ్రేషన్ పై కీలక నిర్ణయం ప్రకటించారు. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. మూడవ ప్రపంచ దేశాల నుంచి వలసలను శాస్వతంగా నిలిపివేశారు ట్రంప్. అక్రమ ప్రవేశాల వల్ల ప్రభావితమైన అమెరికా వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టడమే ఈ లక్ష్యంగా పేర్కొన్నారు.
Also Read : బ్రేకింగ్: పిన్నెల్లి బ్రదర్స్ కు సుప్రీం బిగ్ షాక్..!
ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ (బర్మా), చాడ్, కాంగో రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల పౌరులను పూర్తిగా నిషేధించింది. స్లీపి జో బిడెన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అమెరికాకు ఆస్తిగా మారని వారిని, లేదా దేశాన్ని ప్రేమించని ఎవరిని అయినా సరే నిషేదిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దేశీయ ప్రశాంతత లేకుండా చేసే వలసదారులను సహజత్వం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
Also Read : యూట్యూబ్ లో హనుమాన్ చాలీసా సరికొత్త రికార్డ్
అమెరికా పౌరులు కాని వారికి అందుతున్న ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలు లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. భద్రతా ప్రమాదం లేదా పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీ జాతీయుడిని అయినా బహిష్కరిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. రివర్స్ మైగ్రేషన్ మాత్రమే ఈ పరిస్థితిని పూర్తిగా నయం చేయగలదని ట్రంప్ స్పష్టం చేసారు. అమెరికాను నాశనం చేయాలనుకునే వారు ఎవరైనా సరే అమెరికాలో ఉండబోరు అంటూ ట్రంప్ స్పష్టత ఇచ్చారు.

