Sunday, March 22, 2026 07:05 AM
Sunday, March 22, 2026 07:05 AM

అమెరికా వెళ్ళే టూరిస్ట్ లకు ట్రంప్ మరో షాక్..!

అన్ని రకాల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కార్.. ఇప్పుడు మరో వార్నింగ్ ఇచ్చింది. టూరిస్ట్ వీసాలకు సంబంధించి కొన్ని హెచ్చరికలు పంపింది అమెరికా. సాధారణంగా అమెరికా గగనతలంలో, లేదా అమెరికా వెళ్ళిన తర్వాత మహిళలు ప్రసవిస్తే.. పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుంది. దీనిని కొందరు అవకాశంగా తీసుకుని.. డాక్టర్ లు డేట్ ఇచ్చిన వెంటనే అమెరికా వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనిని గమనించిన అమెరికా సర్కార్.. కీలక వార్నింగ్ ఇచ్చింది.

Also Read : భారత్ కు మరో కంట్రీ షాక్..!

బిడ్డకు అమెరికన్ పౌరసత్వం పొందడానికి సత్వరమార్గంగా – జన్మనిచ్చే ఉద్దేశ్యంతో అమెరికాకు ప్రయాణిస్తున్నట్లు అనుమానం వస్తే.. ఎవరికి అయినా సరే వారి టూరిస్ట్ వీసా రద్దు చేస్తామని, అమెరికా వెళ్లేందుకు మళ్ళీ అవకాశం ఉండదు అని హెచ్చరించింది. నవజాత శిశువుకు పౌరసత్వం పొందడానికి అమెరికా టూరిస్ట్ వీసాను ఉపయోగించడం వ్యవస్థను దుర్వినియోగం చేయడమే కాకుండా, అమెరికన్ పన్ను చెల్లింపుదారులు వైద్య ఖర్చులను భరించాల్సి వస్తుందని విదేశాంగ శాఖ గతంలోనే ఈ విషయం గురించి వార్నింగ్ ఇచ్చింది.

Also Read : దువ్వాడ, దివ్వెల దంపతుల అరెస్ట్..?

ఇటువంటి చర్యలను అమెరికా అసలు అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొంది అమెరికా. ఇక సోషల్ మీడియా ఎకౌంటు లకు సంబంధించి అమెరికా కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక నుంచి వీసా ఇంటర్వ్యూలకు వెళ్ళే వారు తమ పేరు మీద ఉన్న సోషల్ మీడియా ఖాతాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. త్వరలో భారీగా హెచ్ 1 బీ వీసాలను అమెరికా షెడ్యూల్ చేసింది. వీరిలో 70 శాతం మంది భారతీయులే ఉన్నారు. దీనితో ఆందోళన మొదలయింది. అమెరికాకు వ్యతిరేకంగా, ఇజ్రాయిల్ ను విమర్శిస్తూ పోస్ట్ లు ఉంటే కఠినంగా వ్యవహరించనుంది అమెరికా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్