తమిళ రాజకీయాల్లో టీవీకే అడుగు పెట్టిన నాటి నుంచి.. ఆ పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ వస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ను తమదారిలోకి తెచ్చుకోవాలని బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే అధికార పార్టీకి పడే హిందు వ్యతిరేక ఓటును కొంత తగ్గించే అవకాశం ఉందని, బిజెపి లెక్కలు వేస్తుంది. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త ఆసక్తిని రేపుతోంది. తాజాగా ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read : నయనతార కావాలన్న ఎంపీ.. తమిళనాట రచ్చ రచ్చ..!
త్రిష త్వరలో విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరే అవకాశం ఉందని, ఆమెకు చెన్నైలోని ఒక కీలక నియోజకవర్గం నుండి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను కలిశారని, ఈ భేటీలోనే ఎన్డీఏ – టీవీకే పొత్తు గురించి చర్చలు జరిగాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. విజయ్ పార్టీకి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య త్రిష ఒక వారధిగా పనిచేస్తున్నారని, పొత్తుల నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : రక్త హీనత ఉంటే కాఫీ, టీ తాగకూడదా..?
అధికార డీఎంకేను ఓడించేందుకు ఎన్డీఏ కూటమి విజయ్ పార్టీని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏఐడీఎంకే నేతలు కూడా త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చేరితే విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు సుమారు 80 సీట్లు కేటాయించే ప్రతిపాదన వచ్చినట్లు కొన్ని పత్రికలూ కథనాలు రాసాయి. ఈ పొత్తు వార్తలను టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ తోసిపుచ్చారు. ఇవన్నీ నిరాధారమైన పుకార్లని, తమ సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. గతంలో త్రిష, రాజకీయాల్లోకి తన పేరును లాగడం సరికాదని, తాను ఏ పార్టీకి అనుకూలంగా పని చేయడం లేదన్నారు.

