భారతదేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా చెప్తున్నా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపధ్యంలో వరుస పరిణామాలు ఆ సంస్థను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దేశీయ విమానాల్లో కూడా సాంకేతిక సమస్యలు ఉన్నాయని బయటపడటంతో ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేస్తూ వస్తోంది. ఇక సాంకేతిక కారణాలతో పలు విమానాలను తాత్కాలికంగా టాటా గ్రూప్ నిలిపివేసింది. 273 ప్రాణాలు తీసిన ఆ ఘటన తర్వాత ప్రయాణికులు కూడా ఎయిర్ ఇండియా అంటే భయపడుతున్నారు.
Also Read : యోగాంధ్ర.. ఏపీ బ్రాండ్.. రికార్డుల మోత..!
ఇదిలా ఉంచితే తాజాగా ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గించనున్నట్లు, 3 విదేశీ గమ్యస్థానాలకు సర్వీసులను నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా గురువారం తెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతర్గత ఇబ్బందులతో సతమవుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ.. ప్రయాణికులకు ఉన్న ఇబ్బందులను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
Also Read : రప్ప రప్ప ఎవరిని నరుకుతావ్ జగన్..? పయ్యావుల అదిరిపోయే కౌంటర్
వైడ్-బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తామని తెలిపింది. ఇది జూన్ 21, 2025 నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. కనీసం జూలై 15, 2025 వరకు కొనసాగుతాయని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) రూట్స్ లో జూలై 15 వరకు సర్వీసులు నిలిపివేస్తోంది. ఢిల్లీ-నైరోబి మార్గంలో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్సర్-లండన్ (గాట్విక్) మరియు గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు విమానాలు నడుస్తున్నాయని ఎయిర్‌లైన్ తెలిపింది. అంతేకాకుండా, ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, దూర ప్రాంత నగరాలకు అనుసంధానించే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు తగ్గిస్తామని పేర్కొంది. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో మరియు ఢిల్లీ-వాషింగ్టన్ మార్గాలలో విమాన సర్వీసులు తగ్గనున్నాయి.

