Wednesday, February 4, 2026 12:18 PM
Wednesday, February 4, 2026 12:18 PM

ఐపిఎల్ లో సంచలన మార్పులు ఇవేనా..?

ఐపిఎల్ లో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ముఖ్యంగా కీలక ఆటగాళ్ళు వారి వారి జట్లను మారే అవకాశం ఉందనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. రవీంద్ర జడేజా, సంజు సామ్సన్, సాం కర్రన్ సహా పలువురు కీలక ఆటగాళ్ళు జట్లు మారే అవకాశం ఉండవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జాతీయ మీడియా ఆసక్తికర కథనాలను సైతం ప్రసారం చేస్తోంది. అసలు ఏయే జట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం.

Also Read : మంచి చెడు తెలియట్లేదు.. ఎమ్మెల్యేలపై లోకేష్ ఫైర్

రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న సంజూ సామ్సన్.. రాజస్థాన్ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాజస్థాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న సామ్సన్, చెన్నై సూపర్ కింగ్స్ కు మారే అవకాశం ఉంది. అతను చెన్నై వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం.. కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఆ సమయంలో ఢిల్లీ ఆటగాళ్ళు ఒకరిద్దరు జట్టు మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అది జరిగితే సంజూ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉండవచ్చు. ఇక రవీంద్ర జడేజా కోసం ముందు ఢిల్లీ ప్రయత్నం చేసినట్టు సమాచారం.

కానీ ఢిల్లీకి వెళ్లేందుకు జడేజా సుముఖంగా లేడని తెలియడంతో.. రాజస్థాన్ ప్రయత్నాలు మొదలుపెట్టగా అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే జడేజాను రాజస్థాన్ తీసుకుంటే వారి, ఇద్దరు కీలక ఆటగాళ్లను చెన్నై అడిగినట్టు తెలుస్తోంది. జడేజా ఆల్ రౌండర్ కాబట్టి.. ఓ బ్యాట్స్మెన్, బౌలర్ ను అడిగినట్టు తెలుస్తోంది. కానీ ఆ ఒప్పందం చివరి క్షణంలో విఫలమైందని తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో ఆడుగుతున్న దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ ను సంజూ స్థానంలో రాజస్థాన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Also Read : లైట్ తీసుకోవద్దు.. జూబ్లీహిల్స్ ఎన్నికపై రేవంత్ సీరియస్

అలాగే అన్‌క్యాప్డ్ బ్యాటర్ సమీర్ రిజ్విని కూడా డీల్‌ లో చేర్చేందుకు ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. సామ్సన్ దశాబ్ద కాలంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 11 సీజన్లలో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన అతను, 19 ఏళ్ళ వయసులో రాజస్థాన్ కు ఆడాడు. సామ్సన్ 67 మ్యాచ్‌ల్లో ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్