Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

బులుగు కార్యకర్తల్లో ఉగ్ర లక్షణాలు..? ఇస్లామిక్ స్టేట్ ను గుర్తు చేస్తున్న చేష్టలు..!

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా.. అలియాస్ ఐసిస్.. అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉన్న అందరికీ ఈ పేరు బాగా పరిచయమే. మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సిరియాలో అబూ బకర్ అల్ బగ్దాది నేతృత్వంలో ఈ ఉగ్రవాద సంస్థ సృష్టించిన మారణ కాండ అందరికీ గుర్తుండే ఉంటుంది. తమ మాట వినని ఎందరినో.. పాశవికంగా అంతం చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యేవి. తుపాకులతో, కత్తులతో వాళ్ళు చేసిన చేష్టలు చూసి.. ఆల్ ఖైదా, లష్కర్ ఏ తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, తాలీబాన్ వంటి ఉగ్ర సంస్థలు కూడా భయపడేవి.

Also Read : ఒంటరైన రఘురామ..?

అయితే కాల క్రమేణా వారిని రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు తమ ఆపరేషన్ లలో అంతం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ లక్షణాలే కొందరు వైసీపీ కార్యకర్తల్లో కనపడుతున్నాయి. తాము అధికారం కోల్పోయాం అనే ఆవేదనలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు.. రప్ప రప్ప అంటూ ఓ సినిమా డైలాగ్ ను పట్టుకుని.. తమ ప్రతాపాన్ని జంతువులపై చూపిస్తూ తలలు తెంచుతున్నారు. ఇటీవల జగన్ పుట్టిన రోజు సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు, జంతు బలులు చూస్తే వారిలో ఉన్న వికృత మనస్తత్వం అర్ధమవుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.

జగన్ పర్యటనలలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. వ్యతిరేకించిన వారిని మహిళలు అని కూడా చూడకుండా కాళ్ళతో తన్నారు. తాజాగా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ అభిమానులు ఇదే తరహ చేష్టలకు దిగారు. జగన్‌ ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలి ఇచ్చిన వైసీపీ అభిమానులు.. మేకపోతు తల నరికి ‘రప్పా.. రప్పా’ అంటూ వీడియోలు చేసారు. మేకపోతు రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేయడం గమనార్హం. దీనితో చోడవరం గ్రామానికి చేరుకుని, ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : డ్రగ్స్ కేసులో దొరికిపోయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు..?

ఇదే తరహాలో రాష్ట్రం మొత్తం వ్యవహరించడం ఆందోళన రేపుతోంది. రేపు అధికారంలోకి వస్తే మనుషుల తలలు కూడా అలానే తెంచుతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి జగన్ నుంచి మద్దతు ఉండటంతో వారు మరింత చెలరేగిపోవడం గమనార్హం. అటు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఈ తరహా ధోరణి ప్రదర్శిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనితో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్