Thursday, February 5, 2026 05:26 AM
Thursday, February 5, 2026 05:26 AM

అప్పుడు అలా అన్నారు.. మరి ఇప్పుడేమంటారు..?

కూటమి సర్కార్‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడినట్లుగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిన టీడీపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు తమ పాలనలో ఎలా వ్యవహరిస్తారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. పథకాల అమలులో ప్రస్తుతం నియమ నిబంధనలను కూటమి సర్కార్ రూపొందిస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానంగా తల్లికి వందనం పథకం ఏప్రిల్ నెలాఖరు నాటికి అమలు చేయాల్సి ఉంది. తల్లికి వందనం పథకం విధి విధానాలపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు కూడా. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనం అందిస్తామని శాసనసభలో, మండలిలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Also Read : చంద్రబాబు నిజంగానే మారారా..?

అలాగే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందిస్తామని కూడా లోకేష్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే తాజా బడ్జెట్‌లో తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు కేటాయించారు. ఏపీలో మొత్తం 81 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 69.16 లక్షల మంది తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తల్లికి వందనం ఎప్పుడిస్తారంటూ వైసీపీ నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదే పథకంపై ఎన్నికల సమయంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరించిన తీరును వ్యంగ్యంగా చేసి చూపించారు వైసీపీ అధినేత జగన్.

Also Read : రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రైళ్లు సికింద్రాబాద్ కు రావు..!

చివరికి వినుకొండలో హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో కూడా.. తల్లికి వందనం వచ్చిందా మీకు అంటూ పథకాల గురించే జగన్ ప్రస్తావించారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ఎంత మందికి ఇచ్చారు జగన్ అంటూ టీడీపీ నేతలు ప్రశ్నించడంతో.. వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఐదేళ్లు ఇవ్వకుండా.. చివరి ఏడాది ఎగ్గొట్టిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే 2019 ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి అని స్వయంగా జగన్ భార్య భారతి చెప్పిన వీడియోను ట్రోల్ చేసిన కూటమి నేతలు.. చివరికి ఒకరికే ఎలా ఇచ్చారని నిలదీశారు.

Also Read : బెట్టింగ్ యాప్స్.. బయటకు వస్తున్న మోసగాళ్ళు..!

దీంతో గుక్క తిప్పుకోలేని పరిస్థితుల్లో తల్లికి వందనం పథకం అమలు చేయరంటా అంటూ తప్పుడు ప్రచారం కూడా చేశారు. అయితే దీనిపై అసెంబ్లీలోనే మంత్రి లోకేష్ స్వయంగా ప్రకటన చేయడంతో వైసీపీ నేతల నోళ్లు మూత పడ్డాయి. ఇక తల్లికి వందనం పథకం అమలుకు సమయం దగ్గర పడటంతో.. విధివిధానాలపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి కోసం రూపొందించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం సమీక్షిస్తోంది. గతంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేసిన సమయంలో వైసీపీ సర్కార్ కొన్ని రూల్స్ పెట్టింది.

Also Read : రాజకీయ అనాధలకు బిజెపి ఆశ్రయం

ఇందులో ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి, ఆదాయ పన్ను చెల్లింపు దారులకు, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారికి, అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్న వారితో పాటు కారు కలిగి ఉన్న వారిని కూడా పథకానికి అనర్హులుగా ప్రకటించింది. దీనిపై అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. విద్యుత్ వినియోగంతో పాటు కారు ఉన్న వారిని తొలగించడం పట్ల అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు తప్పుబట్టారు. పాత కారు ధర రూ.లక్ష లోపే ఉంటుందని.. కాబట్టి అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూడా. కానీ వైసీపీ సర్కార్ మాత్రం ససేమిరా అంది. అయితే ఇప్పుడు మాత్రం అవే నిబంధనలను కూటమి సర్కార్ కొనసాగిస్తుందా.. లేక సడలింపు ఇచ్చి.. కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్