Sunday, March 22, 2026 04:15 PM
Sunday, March 22, 2026 04:15 PM

కొంప ముంచుతున్న టీడీపీ పిఏలు..?

ఏపీలో 2024 లో కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగమైనటువంటి టిడిపి భారీ సీట్లతో చరిత్ర సృష్టించింది. అవకాశం ఇచ్చిన ప్రతి నాయకుడు మంచి విజయాలే నమోదు చేశారు. ఈసారి ఎన్నారై లకు ఎక్కువగా అవకాశం ఇవ్వటంతో వాళ్లు కూడా భారీగానే ఖర్చు చేసి ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. నియోజకవర్గంలో సీను మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఎన్నారైల నియోజకవర్గాల్లో అవినీతి కార్యక్రమాలకు సంబంధించి తీవ్రస్థాయిలో గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పిఏలు, సన్నిహితులు పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి.

Also Read : మాజీ మావోయిస్టుల సంచలన నిర్ణయం..?

తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఓ ఎన్నారై గారి నియోజకవర్గంలో పరిస్థితిపై టీడీపీ అనుకూల మీడియా ఓ కథనం కూడా ప్రచురించింది. పిఏ అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ పేర్కొంది. అయితే వాస్తవ పరిస్థితి కేవలం ఏ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో.. ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి అనే కామెంట్స్ వినపడుతున్నాయి. పీఏ ల కారణంగా ఇప్పటికే.. ఇద్దరు మహిళా మంత్రులు ఇబ్బంది పడ్డారు. వారి వారి వ్యవహారాలతో నియోజకవర్గాల్లో బ్రష్టుపట్టే పరిస్థితి నుంచి కొంత బయటపడ్డారు. ఇక ఇప్పుడు ఇతర మంత్రులకు కూడా ఈ పి ఎ ల తలనొప్పి ఎక్కువగానే ఉంది.

Also Read : వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

చాలా నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వీరు.. ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయాల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని.. ప్రజలకు ఎమ్మెల్యేకి మధ్య సంబంధాలు తెంచేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. మంత్రుల వద్ద ఉన్న పార్టీ పీఏలు నియోజకవర్గంలో ఎక్కువగా పెత్తనం చేయడమే కాకుండా.. పనితీరు విషయంలో సహకరించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలో ఆరు నెలల ముందు జాయిన్ అయిన వారిని కూడా ఈ హోదాలో నియమించారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఒకరిద్దరు మంత్రులకు వద్ద ఈ సమస్య గట్టిగానే ఉంది. దీనిపై పార్టీ దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్