Saturday, March 21, 2026 11:00 PM
Saturday, March 21, 2026 11:00 PM

అప్పటి వరకు.. సూర్యా భాయ్ కే కెప్టెన్సీ..?

భారత క్రికెట్ లో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం వెలవడుతుందా అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది. ముఖ్యంగా హెడ్ కోచ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వన్డే, టెస్ట్ జట్టులో మార్పులు వేగంగా జరిగాయి. ఇక తాజాగా టి20 జట్టుపై గంభీర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ కాగా అతను త్వరలోనే పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అతనిపై విమర్శలు రావడంతో సెలెక్టర్లు వెనక్కు తగ్గినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Also Read : పెద్దిరెడ్డి అక్రమాల వీడియోలు తీయించానన్న పవన్.. సూపరన్న చంద్రబాబు..!

అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం.. వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచ కప్ వరకు ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఓడిపోయి ఉంటే సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టే అవకాశం ఉండేది. కానీ.. మూడు, నాలుగు టి20 లలో భారత్.. విజయం సాధించడంతో సీరిస్ కైవసం చేసుకుంది. దీనితో సూర్యకుమార్ యాదవ్ విషయంలో సెలెక్టర్లు వెనక్కు తగ్గినట్లు సమాచారం. వచ్చే ఏడాది టీ20 ఎలాగైనా సరే గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది.

Also Read : ఆత్మాహుతే.. కారు నడిపిన ఎంబీబీఎస్ డాక్టర్..!

ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక టి20 ప్రపంచ కప్ కూడా గెలిచి 2027 లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని భారత్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పులు జరిగితే అనవసరంగా జట్టులో ఉన్న కీలక ఆటగాళ్ల మానసిక పరిస్థితి పై ప్రభావం పడుతుందని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పెద్దగా రాణించని గిల్ ను పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవల టి20 ప్రపంచ కప్ కు సంబంధించి.. ఐసీసీ తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్