Wednesday, February 4, 2026 06:05 PM
Wednesday, February 4, 2026 06:05 PM

వీధి కుక్కలపై సుప్రీం సంచలన ఆదేశాలు..!

దాదాపు నాలుగు నెలల నుంచి సుప్రీం కోర్ట్.. వీధి కుక్కల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. వీధిక కుక్కల జనాభా క్రమంగా పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోన్న నేపధ్యంలో.. వాటిని ప్రభుత్వం షెల్టర్ లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ నేపధ్యంలో క్రమంగా తీర్పులో మార్పులు చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. ఇక తాజాగా మరోసారి ఈ విషయంలో సుప్రీం కోర్ట్ మరోసారి ఈ వ్యవహారంపై తన ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ప్రచారానికి ఆ ముగ్గురు దూరం.. కారణాలేమిటో..?

వీధి కుక్కల కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్ల ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను తరలించాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మేరకు తమ ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది. ఆ కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత తిరిగి అదే ప్రదేశాలలోకి వదలవద్దని స్పష్టం చేసింది. వీధికుక్క కాటు సంఘటనలను సుమోటోగా పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

Also Read : మోడీ నాకు మంచి ఫ్రెండ్.. భారత్ వెళ్తాను: ట్రంప్

ప్రస్తుతం ఈ ప్రాంగణాల్లో ఉన్న అన్ని వీధికుక్కలను పట్టుకుని, క్రిమిరహితం చేసి, టీకాలు వేయాలని ఆదేశించింది. రెండు వారాల్లోపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వైద్య సంస్థలు, ప్రజా రవాణా కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలను గుర్తించాలని, ఎనిమిది వారాల్లోపు ఈ ప్రాంతాలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని, ముఖ్యంగా సరిహద్దు గోడల ద్వారా వీధికుక్కలు ప్రవేశించకుండా నిరోధించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నిఘా కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. స్థానిక మున్సిపల్ అధికారులు, పంచాయతీలలో కనీసం మూడు నెలల పాటు కాలానుగుణంగా తనిఖీలు నిర్వహించి కోర్టుకు నివేదించాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్