పల్నాడులో జరిగిన జంట హత్యల వ్యవహారంలో మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరులు అరెస్ట్ కావడం లాంచనం అయింది. నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కాసేపటి క్రితం సుప్రీం కోర్ట్ తన తీర్పు వెల్లడించింది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం నానా కష్టాలు పడుతున్న పిన్నెల్లి సోదరులకు ఊహించని దెబ్బ తగిలింది. టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. సరెండర్ కావడానికి గడువు కావాలని పిన్నెల్లి లాయర్లు కోరారు.
Also Read : సాక్షికి లోకేష్ మరో స్ట్రోక్.. సంచలన నిజాలు వెలుగులోకి..!
దీనితో సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు.. హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా కొట్టేసారు. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా సరే సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించింది.
Also Read : రాజకీయం మొదలెట్టిన రేవంత్..? బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..!
సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం దృష్టికి తీసుకువెళ్ళింది. వెంటనే అరెస్టుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. లొంగిపోవడానికి 2 వారాలు సమయమివ్వాలన్న పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా.. ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని, ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరని పేర్కొంది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు.

