Wednesday, February 4, 2026 09:32 PM
Wednesday, February 4, 2026 09:32 PM

హిట్ 3 క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?

ఒక తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా సరే సీక్వెల్స్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఒక్క సినిమా హిట్ అయితే దాని సీక్వెల్ ను తీసుకొస్తూ అభిమానుల్లో హైప్ పెంచేస్తున్నారు. ఇక సాధారణ సినీ ప్రేక్షకులు కూడా సీక్వెల్స్ ను గట్టిగానే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమిళ తెలుగు సినిమాల్లో ఈ సీక్వెల్స్ హడావుడి ఎక్కువగా నడుస్తోంది. తమిళంలో సినిమాటిక్ యూనివర్స్ హడావుడి నడుస్తుంటే.. మన తెలుగులో సీక్వెల్స్ సందడి వేరే లెవెల్ లో ఉంది.

Also Read : ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఎన్టీఆర్ ఒక్కడే బెస్ట్

ప్రస్తుతం హిట్ 3 గురించి టాలీవుడ్ ఎక్కువగా మాట్లాడుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు గట్టిగానే వైరల్ చేస్తున్నారు ఫాన్స్. మొదటి రెండు పార్ట్ లు సూపర్ హిట్ అవడంతో థర్డ్ పార్ట్.. విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 2 క్లైమాక్స్ లో నానిని చూపించి పార్ట్ 3 హీరో ఎవరో చెప్పేసిన శైలేష్.. ఇప్పుడు తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడనే దానిపై హిట్ 3 లో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది.

Also Read : సల్మాన్ ను వెంటాడుతున్న బ్యాడ్ టైం

మూడు పార్ట్ లు తెలుగు హీరోలతో చేసిన డైరెక్టర్.. నాలుగో పార్ట్ మాత్రం తమిళ్ హీరో తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో కార్తీ తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఇక హిట్ నాలుగో పార్ట్ నుంచి తమిళ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. నాలుగో పార్ట్ హీరోను మూడో పార్ట్ క్లైమాక్స్ లో పరిచయం చేయడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి కొన్ని సీన్స్ ను ఇప్పటికే ప్లాన్ చేశారు. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నారు.

Also Read : బయటపడ్డ వైసీపీ డబుల్ గేమ్..!

ఇక ఈ నెలతో షూటింగ్ కంప్లీట్ చేయాలని డైరెక్టర్ కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే పోలీస్ పాత్రలో కార్తి తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఖాకీ సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. దానికి తోడు తమిళంలో కార్తీకి మంచి మార్కెట్ ఉంది. హిట్ సీరిస్ కు తెలుగులో క్రేజ్ ఉండటం.. తమిళంలో కార్తీ కి మార్కెట్ ఉండటంతో ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్