Sunday, March 22, 2026 03:11 AM
Sunday, March 22, 2026 03:11 AM

సీదిరి ఒంటరి పోరాటం.. వైసీపీ నేతల సహాయ నిరాకరణ..!

ఓ వైపు అరెస్టు పుకార్లు.. కానీ.. కేసు మాత్రం ఇప్పటికీ నమోదు కాలేదు.. ఇంకా చెప్పాలంటే.. ఏం కేసు నమోదు చేయాలనే విషయంపై పోలీసులకే క్లారిటీ లేదు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం.. పశువుల మంత్రి అరెస్టు ఖాయం అని పదే పదే మీడియా ముందు చెబుతున్నారు. చివరికి ఈ పరిణామాలు అదే మాజీ మంత్రికి ప్లస్ అవుతుంటే.. తొలిసారి గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు మాత్రం కావాల్సినంత చెడ్డపేరు తీసుకువస్తోంది. ఈ వ్యవహరం మాజీ మంత్రి వర్సెస్ సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేగా మారిపోవడం సిక్కోలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : లైట్ తీసుకోవద్దు.. జూబ్లీహిల్స్ ఎన్నికపై రేవంత్ సీరియస్

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజుకు ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీషకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గౌతు శిరీషపై నాటి ప్రభుత్వ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఒక దశలో సోషల్ మీడియాలో శిరీషపై తప్పుడు ప్రచారం కూడా చేశారు. దీంతో శిరీష పలు సందర్భాలు కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఓ మహిళ అని కూడా చూడకుండా తనపై వ్యక్తిత్వ హననానికి తెగబడ్డారని శిరీష ఆరోపించారు కూడా. అయితే 2014-19 మధ్య కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో టీడీపీ అభిమానులు, నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. దీనిపై శిరీష అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. దీనికి మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరించారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీదిరి అప్పల్రాజు అరెస్టు కోసం టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రధాన కారణం.. అసెంబ్లీలోనే టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అందుకే సీదిరిని అరెస్టు చేయాలని టీడీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సీదిరి అప్పల్రాజుపై ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశారనేది పోలీసుల మాట. ఇదే విషయాన్ని సీదిరి అప్పల్రాజు కూడా స్వయంగా ప్రకటించారు. ఏ నిమిషమైనా సరే.. తన అరెస్టు ఖాయమని.. ఇదే విషయాన్ని తన భార్యకు కూడా చెప్పినట్లు అప్పల్రాజు స్వయంగా మీడియా ముందే వెల్లడించారు. అయితే ఇక్కడే అసలు విషయం పెద్ద మిస్టరీగా మారింది. అదేమిటంటే.. అప్పల్రాజు మీద నమోదైన కేసుల్లో విచారణ కోసం పోలీసులు 41ఏ నోటీసులు ఇస్తున్నారు.. అప్పల్రాజు కూడా కాదు అనకుండా స్టేషన్‌కు వస్తున్నారు. పోలీసు విచారణలో వాళ్ల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. మళ్లీ వచ్చిన దారే వెళ్లిపోతున్నారు. అంతే తప్ప.. ఒక్క కేసులో కూడా సీదిరి అప్రల్రాజుపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు కాలేదు.

అయితే ఇక్కడే మరో విషయం అర్థం కావటం లేదు. సీదిరి అప్పల్రాజుకు వైసీపీ అధికార ప్రతినిధి హోదా కల్పించింది. దీంతో పార్టీ తరఫున సీదిరి గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అయితే సీదిరి అప్పల్రాజుకు సిక్కోలు జిల్లా వైసీపీ నేతలు మాత్రం పూర్తిగా సహాయ నిరాకరణ ఉద్యమం చేయడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.. రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు అప్పల్రాజు. పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీషకు వ్యతిరేకంగా పార్టీ తరఫున గళం విప్పుతున్నారు. అయితే అప్పల్రాజుకు జిల్లాలో కనీసం ఒక్కనేత కూడా అండగా లేకపోవడం సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లాలో వైసీపీ మాజీలుగా ఉన్న సీనియర్లు ఒక్కరు కూడా సీదిరికి మద్దతు తెలియజేయటం లేదు.

Also Read : ఆత్మాహుతే.. కారు నడిపిన ఎంబీబీఎస్ డాక్టర్..!

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ సహా ఏ ఒక్కరు కూడా సీదిరి అప్పల్రాజుకు అనుకూలంగా మాట్లాడటం లేదు. దాదాపు ఏడాది తర్వాత ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు.. నేతలతో 2 గంటల పాటు సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కేటాయించడంపైనే ప్రసంగించిన ధర్మాన.. మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజుపైన 8 కేసులు నమోదు చేయడంపై కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇక తమ్మినేని కూడా నాకెందుకు వచ్చింది అన్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప.. సీదిరి అప్పల్రాజుకు నోటీసులు ఇవ్వడాన్ని.. విచారణకు పిలవడాన్ని ఏ మాత్రం ప్రస్తావించటం లేదు. దీంతో సిక్కోలు జిల్లాలో సీదిరి పూర్తిగా ఒంటరి అయ్యారనే మాట వినిపిస్తోంది. జిల్లాలో సీనియర్ల మాట కాదని ఎవరైనా రాజకీయాలు చేస్తే.. వాళ్లకు మిగిలిన నేతలంతా సహాయ నిరాకరణ చేస్తారనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్