Wednesday, February 4, 2026 09:42 AM
Wednesday, February 4, 2026 09:42 AM

రాజాసాబ్ ఫ్యాన్స్ కు వంగా న్యూ ఇయర్ గిఫ్ట్..??

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పాన్ ఇండియా ట్యాగ్ లైన్ కు కంప్లీట్ గా న్యాయం చేసే ప్రభాస్.. ఇప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకు తన సత్తా ఏంటో చూపిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ అనే సినిమాతో ఇండియన్ సినిమాను రూల్ చేసేందుకు రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ప్రభాస్ లుక్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమా టేకింగ్, క్లాస్, మాస్ ఎలిమెంట్స్ అన్ని ఓ రేంజ్ లో ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ కు కావలసిన స్టఫ్ తో ఈ సినిమాను డైరెక్టర్ మారుతి రెడీ చేసేసాడు.

Also Read : సినిమా రేటింగ్‌లో అక్రమాలు..!

ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న.. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగానే ఎదురు చూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ ట్రాక్ రికార్డ్ పై పిచ్చి పిచ్చిగా క్లారిటీ ఉన్న ఫ్యాన్స్.. ప్రభాస్ ను ఏ రేంజ్ లో వంగా చూపిస్తాడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఇప్పటివరకు ఎక్కువ గా రాకపోయినా వచ్చిన అప్డేట్స్ మాత్రం దుమ్ము రేపాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు కనపడని లుక్ లో కనబడతాడని.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోలను చూపించినట్లుగానే ఈ సినిమాలో ప్రభాస్ ను డైరెక్టర్.. కొత్తగా చూపించబోతున్నాడు అంటూ.. ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Also Read : హెచ్ 1 బీ వీసా అప్లై చేసిన వారికి షాక్..?

సినిమా షూటింగ్ ఎప్పుడూ లేనివిధంగా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ.. అటు బాలీవుడ్ ను కూడా ఫిదా చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ త్వరలోనే వచ్చే ఛాన్స్ కనబడుతోంది. జనవరి 1 కు సినిమా అప్డేట్ ఒకటి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే టైటిల్ తో పాటుగా ప్రభాస్ లుక్ కు సంబంధించి 20 సెకండ్ల వీడియో ఒకటి రెడీ చేసాడని.. అది జనవరి 1కి రిలీజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అంటూ సమాచారం. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్