Wednesday, February 4, 2026 02:31 PM
Wednesday, February 4, 2026 02:31 PM

బోల్డ్ డెసిషన్ తీసుకున్నా.. రాజ్ నిడమోరుతో సమంత

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా ఓ సెన్సేషన్. సినిమా కెరియర్ కంటే పర్సనల్ లైఫ్ ద్వారా సమంత ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటుంది. కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అయినా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆమె ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తోంది. నాగచైతన్యతో వివాహం ఓ సంచలనం కాగా ఆ తర్వాత విడాకులు మరో సంచలనం. దీనికి రాజకీయాలు అంటగట్టి చేసిన విమర్శలు ఇంకో సంచలనం. ఇదే సమయంలో అనారోగ్య సమస్యలతో సమంత ఇబ్బంది పడుతూ వచ్చింది. అయినా సరే కెరీర్ విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ టైం లో ఆమె తనతో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో రిలేషన్ స్టార్ట్ చేసింది అనే ప్రచారం మొదలైంది.

Also Read : ప్రశాంత్ వర్మపై నిర్మాతల ఆగ్రహం – వంద కోట్ల అడ్వాన్స్ వివాదం?

రాజ్ నిడమోరు అనే యంగ్ డైరెక్టర్ తో ఆమె ప్రేమలో పడినట్లు.. అతన్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దానికి తోడు వీళ్లిద్దరూ ఎక్కువగా కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో కూడా సమంతా పోస్ట్ చేసింది. ఇక లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో.. ఫ్రెండ్స్ తో కలిసి నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను రిలీజ్ చేసింది. తన కెరీర్ కు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, తన వ్యక్తిగత జీవితంలో అండగా ఉన్నవాళ్ళకు థాంక్స్ చెప్తూ.. ఆమె ఈ పోస్ట్ చేసింది.

Also Read : సార్ మీ స్కిన్ కేర్ ఏంటీ..? మోడీతో మహిళా క్రికెటర్ కామెంట్

ఈ ఫోటోలో రాజ్ తో ఆమె సన్నిహితంగా కనిపించారు. సమంతను రాజ్ హగ్ చేసుకున్న విధానం.. సమంత ఎక్స్ప్రెషన్స్.. అన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్.. ప్రేమ అనే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ మీడియా కూడా ఫోకస్ పెట్టి వీళ్ళిద్దరి రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీలు రాసింది. #NothingToHide అనే హ్యాష్ ట్యాగ్ ను సమంత పోస్ట్ చేసింది. ఇది సమంత ప్రచారం చేసే ఓ పెర్ఫ్యూమ్ యాడ్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్. దీనితో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఓపెన్ అయిపోయిందని.. 2025 స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మొదలైనట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ పోస్ట్ చూసిన సమంత ఫ్యాన్స్.. ఈ రిలేషన్ అయినా నీకు సంతోషాన్ని ఇవ్వాలని, గతంలో పడిన ఇబ్బందులు, బాధల నుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్