Friday, September 12, 2025 04:53 PM
Friday, September 12, 2025 04:53 PM
roots

గతం మర్చిపోయారా సజ్జల సారూ..?

వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎక్కడా పోలీసులు ప్రకటన చేయకుండా డైరెక్ట్ గా డీజీపీ స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా మీడియా వర్గాల్లో సంచలనం అయింది. ఒకప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సజ్జలకు ఈ పరిస్థితి ఏంటీ అని రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇక నిన్న తనకు నోటీసులు ఇవ్వడాన్ని సజ్జల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు.

సజ్జల మాట్లాడిన మాటల్లో… రాజ్యాంగాన్ని అపహాస్యం చేసారు, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసారు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అని సజ్జల కామెంట్స్ చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడం గురించి గతాన్ని సజ్జల ఎలా మర్చిపోతారు అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ నేతలపై పెట్టిన కేసుల్లో ఒక్కటి అయినా చార్జ్ షీట్ దాఖలు చేసారా అని నిలదీస్తున్నారు. అన్నీ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి అరెస్ట్ చేసి రోజుల తరబడి బెయిల్ రాకుండా కేసులు నమోదు చేసినవే కదా అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : చంద్రబాబుకు కేంద్రంలో కీలక బాధ్యతలు

అలాగే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అప్పుడు టీడీపీ నేతలను వేధించిన రోజులు సజ్జలకు గుర్తు లేవా అని ప్రశ్నిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ కు విధించిన జరిమానాలను ఎలా మర్చిపోతారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. అలాగే టీడీపీ ఆఫీస్ పై దాడి చేసింది పట్టాభి చేసిన వ్యాఖ్యలకే అంటూ సజ్జల మాట్లాడారు. మరి కొడాలి నానీ మాట్లాడిన బూతులు, చంద్రబాబు సతీమణి లక్ష్యంగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు… వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చాలా, తాడేపల్లి ప్యాలెస్ ను కూల్చాలా అని ప్రశ్నిస్తున్నారు. సకల శాఖా మంత్రిగా సజ్జల చేసిన పనులు, చేష్టలు మర్చిపోవద్దు అంటూ హితవు పలుకుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్