Sunday, March 22, 2026 05:22 AM
Sunday, March 22, 2026 05:22 AM

రోకో డామినేషన్.. గంభీర్ కు మరో షాక్..!

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. భారత క్రికెట్ జట్టులో ఆ రెండు పేర్లు వినపడకూడదు.. గత ఏడాది కాలంగా టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్ పట్టుదల ఇది. పూర్తిగా క్రికెట్ నుంచే వెళ్ళిపోయే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే.. సాధ్యం కాని పరిస్థితి. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. వన్డేల్లో కూడా తప్పించాలని చేస్తూ వచ్చిన ప్రయత్నాలు సాధ్యం కాకపోగా.. జట్టుపై వాళ్ళ పట్టు రోజు రోజుకి పెరిగిపోతోంది. ఆస్ట్రేలియా పర్యటనతో విరాట్ కోహ్లీ పని అయిపోయిందని భావించాడు గంభీర్.

Also Read : ఆ యంగ్ స్పీడ్ గన్ ఎక్కడ..? గంభీర్ మర్చిపోయాడా..?

కానీ మూడో వన్డే మొదలు.. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో.. అతని ఆధిపత్యం దెబ్బకు షాక్ అయ్యాడు. రోహిత్ ఆస్ట్రేలియా టూర్ లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపిక అయితే.. విరాట్ కోహ్లీ.. సౌత్ ఆఫ్రికా తో సీరీస్ లో.. మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపిక అయ్యాడు. ఏకంగా రెండు సెంచరీలు, ఓ అర్ధ సెంచరీతో దూకుడు ప్రదర్శించారు. దానికి తోడు ఆ ఇద్దరినీ చూడటానికి మైదానానికి వచ్చిన అభిమానులే ఎక్కువ. ఇక ఇప్పుడు గంభీర్ కు మరో షాక్ ఇచ్చారు కోహ్లీ, రోహిత్.

Also Read : ట్రంప్ టార్గెట్ స్టూడెంట్స్..? భయపెడుతోన్న తాజా లెక్కలు..!

తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. వీటిల్లో నెంబర్ 1 గా రోహిత్ శర్మ, నెంబర్ 2 గా విరాట్ కోహ్లీ నిలిచారు. 781 పాయింట్లతో రోహిత్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాత 773 పాయింట్లతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి కోహ్లీ మూడో మ్యాచ్ లో సెంచరీ చేసి ఉంటే నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించేవాడు. ఇదే సమయంలో రోహిత్ కూడా భారీ అర్ధ సెంచరీతో ఆకట్టుకోవడంతో తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నాడు. ఇక టాప్ 10లో శుభమన్ గిల్ 4, శ్రేయాస్ అయ్యర్ 10 స్థానాల్లో ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్