తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి.. రాజకీయం మొదలుపెట్టారా..? జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల తర్వాత గేర్ మార్చారా..? బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు సిద్దం చేసుకున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణా రాజకీయ వర్గాలు. రేవంత్ రెడ్డిని సాధారణ రాజకీయ నాయకుడిగా అంచనా వేసిన అందరికి ఒక్కో దెబ్బా సైలెంట్ గా తగులుతుండటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచేస్తోంది. తనను తక్కువ అంచనా వేసిన వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలో.. తన మార్క్ పాలిటిక్స్ తో రేవంత్ క్లారిటీ ఇస్తున్నారు.
Also Read : ఇమ్రాన్ బ్రతికే ఉన్నారా..? పాక్ రక్షణ శాఖ ఏం అంటోంది..?
జూబ్లిహిల్స్ లో రేవంత్ చేసిన రాజకీయం ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యర్ధులకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసులను రేవంత్ బయటకు లాగుతున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కేసులు ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం ఓ సంచలనం అయింది. ఎన్నికల ముందు.. ఏసీబీ అధికారులు రెడీ చేసిన నివేదికలో స్పష్టంగా అర్ధమైన విషయం.. ఫార్ములా ఈ రేస్ కేసు.. లొట్ట పీసు కాదు.. లోతుగానే ఉన్న వ్యవహారమని.
ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మళ్ళీ విచారణ మొదలైంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ కేసును బయటకు తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు కేసీఆర్ మాజీ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని విచారించింది సిట్. రాజశేఖర్‌రెడ్డిని రెండు గంటలు పాటు ప్రశ్నించి సిట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్‌రావు స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. రాధకిషన్ రావు స్టేట్‌మెంట్ లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావనకు రావడం సంచలనం అయింది.
Also Read : శివజ్యోతికి టీటీడీ షాక్.. శభాష్ అంటున్న భక్తులు..
కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పనిచేశామని గతంలో స్టేట్మెంట్ ఇవ్వడంతో.. ఓఎస్డీ ని అధికారులు విచారణకు పిలిచారు. అటు ఇతర నాయకులపై ఉన్న కేసులను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని వైపుల నుంచి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు రేవంత్ రంగం సిద్దం చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

