Wednesday, February 4, 2026 08:16 AM
Wednesday, February 4, 2026 08:16 AM

వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!

దేశ స్వాతంత్ర్య కోసం పోరాటం చేసిన వారే సమరయోధులు. బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసిన వారే అసలైన దేశభక్తులు. అహింసా వాదంతో గాంధీ పోరాటం చేశారు. తుపాకీ తూటాతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ దొరలను ఎదిరించారు. తెల్లవారి తుపాకీకి గుండె చూపించిన
టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు వంటి వారే నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు. కానీ వైసీపీ నేతల దృష్టిలో వారేవరు కాదు. వాళ్ల దృష్టిలో దేశభక్తి అంటే అంతకు మించి అన్నట్లుగా ఉంది.

వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఇదేం పిచ్చి రా బాబు అని అనిపిస్తున్నాయి. నిజమైన దేశ భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయంలో కూడా వేడుకలు నిర్వహించారు. కానీ వైసీపీ నేతలు చేసినట్లుగా ఏ ఒక్కరూ చేయలేదు. అందుకే ప్రజాస్వామ్య వాదులు కూడా ఇదేంటి అని విస్మయానికి గురవుతున్నారు.

Also Read : వాట్సాప్ సేఫ్ కాదా..? యూఎస్ కోర్ట్ లో సంచలనం..!

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల చిత్రపటాల సరసన… కేవలం ఒక రాజకీయ వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో ఉంచారు. ఇది ఆ మహనీయుల త్యాగాలను అవమానించడమే కాక, జాతీయ స్ఫూర్తిని కించపరచడమే అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

నిజానికి రాజశేఖర్ రెడ్డి కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే. ఆయన తండ్రి రాజారెడ్డి, తాతల్లో ఒక్కరు కూడా దేశ స్వాంతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు. అలా చేసిన చరిత్ర కూడా వైఎస్ కుటుంబానికి లేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ముఖ్యమంత్రిగా మరణించారు. అంతే తప్ప.. ఆయనకు దేశ స్వాతంత్రానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే.. వైసీపీ నేతలు మాత్రం.. ఆ ఫోటోను గాంధీ, నేతాజీ, అంబేద్కర్ వంటి ఫోటోల పక్కన పెట్టేసి.. నివాళులు అర్పించారు. ఆ ఫోటో ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ తన ధనదాహం కోసం తన తండ్రి వైఎస్ఆర్ పేరునే అక్రమాస్తుల కేసుల్లోకి లాగారనేది సొంత చెల్లెలు షర్మిల ఆరోపణ. ఇక పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేసిన బొత్స.. గతంలో ఇదే వైఎస్ఆర్ గురించి చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. గాంధీ జయంతి రోజు కూడా మందు చుక్క లేనిదే వైఎస్ఆర్ నిద్రపోరు.. కాదని ఆయన భార్య విజయలక్ష్మిని చెప్పమనండి.. అంటూ పీసీసీ అధ్యక్షుని హోదాలో బొత్స సవాల్ విసిరారు. మరి అలాంటి వైఎస్ఆర్ ఫోటోను ఏ ముఖం పెట్టుకుని గాంధీజీ పక్కన పెట్టారో బొత్స సమాధానం చెబితే బాగుంటుంది.

Also Read : మొదటి దెయ్యం ఆయనే.. కవిత మరో సెన్సేషన్..!

రాజ్యాంగం పట్ల గౌరవం లేని తీరు, జాతీయ పతాకానికి వందనం చేయడానికి కూడా బెంగళూరు ప్యాలెస్ దాటి రాని బెంగుళూరు అంకుల్ జగన్ నైజం గురించి ప్రజలందరికీ తెలుసు. రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే నడవాలనే అహంకారంతో, జాతీయ నాయకులను అవమానిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ఈ చర్యల పట్ల పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధృతరాష్ట్రుడి కౌగిలిలాంటి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టడం భావ్యం కాదు. జాతిపిత, రాజ్యాంగ నిర్మాత ఫోటోల పక్కన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి కారణమైన వ్యక్తి ఫోటో ఎలా పెట్టారనేది ఇప్పుడు సగటు భారతీయుడి ప్రశ్న.

ఈ చర్య ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? మహనీయుల స్థాయిని దిగజార్చినందుకు, దేశ ప్రతిష్టను మంటగలిపినందుకు వైసీపీ నాయకత్వం తక్షణమే రాష్ట్రానికి, దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్