Sunday, March 22, 2026 01:51 PM
Sunday, March 22, 2026 01:51 PM

అశ్విన్‌ సడన్‌ రిటైర్‌మెంట్‌ కారణాలివేనా..?

ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో మరపురాని అనుభూతులు భారత క్రికెట్‌కు అందించిన స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ తన 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ ప్రయాణానికి అనూహ్యంగా ముగింపు పలికాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించి ఆశ్చర్య పరిచాడు. అయితే అశ్విన్ తండ్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, 38 ఏళ్ల రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్థానానికి తెరపడింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా టీమిండియాలో చెరగని ముద్ర వేసిన అశ్విన్‌.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ జరుగుతుండగానే ఆటకు వీడ్కోలు పలికాడు. ఏమాత్రం విజయావకాశాల్లేని మ్యాచ్‌లను ఎన్నింటినో తనదైన ప్రదర్శనతో గెలిపించిన అశ్విన్‌.. క్రికెట్‌ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు.

Also Read : ఆస్ట్రేలియాకు మొగుడు అయ్యాడు.. మెంటల్ ఎక్కిస్తున్న బూమ్రా

ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన అశ్విన్ భారత్‌ చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అశ్విన్‌కు ఘన స్వాగతం లభించింది. అశ్విన్ కారులోంచి దిగగానే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. బ్యాండ్‌తో గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పిన అభిమానులు పూలవర్షం కురిపించారు. టీమిండియాకు కెప్టెన్సీ చేయనందుకు బాధపడిన వ్యక్తులను చూశానని.. తనకు మాత్రం ఎలాంటి విచారం లేదన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగినా, ఐపీఎల్‌లాంటి లీగ్‌లతో పాటు క్లబ్‌ క్రికెట్‌లో కొనసాగుతానని అశ్విన్‌ ప్రకటించాడు.

మంచి ఫామ్‌, ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా ఉన్నా అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంపై అభిమానులు సీరియస్ అవుతున్నారు. మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వు.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అశ్విన్ అవసరం టీమ్‌కు ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో అశ్విన్ రిటైర్‌మెంట్‌పై అతడి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది పెట్టిన వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేక తన కుమారుడు టీమ్‌ నుంచి తప్పుకున్నాడన్నారు.

అయితే అశ్విన్‌ను ఎవరు వేధించారు? టీమ్ మేనేజ్‌మెంటా? లేదా సహచర ఆటగాళ్లా? బీసీసీఐ పెద్దలా? సెలెక్టర్లా? అనేది మాత్రం రవిచంద్రన్ బయటపెట్టలేదు. అయితే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై.. దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్