Wednesday, February 4, 2026 12:17 PM
Wednesday, February 4, 2026 12:17 PM

రామ్ చరణ్ – ఉపాసనా ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే..?

కొణిదెల ఉపాసనా కామినేని” వ్యాపార రంగం నుంచి సినీ రంగం, సామాజిక సేవా కార్యక్రమాల వరకు ఈ పేరు ఓ సంచలనం. డైమండ్ స్పూన్ తో పుట్టిన ఉపాసన, వ్యాపార రంగంలో ఎంత పట్టు పెంచుకుందో.. సామాజిక సేవలో సైతం అదే దూకుడు ప్రదర్శించింది. తాత ప్రతాప రెడ్డి నిర్మించిన అపోలో సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించినా సరే.. తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని సక్సెస్ అయింది ఈ మెగా కోడలు. ఉన్నత చదువులు చదవి విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ మహిళగా తాను ఏం చేయగలనో.. పుట్టిన గడ్డపైనే చేసి చూపిస్తోంది.

Also Read : బ్యాంకు స్టేట్మెంట్ తో అడ్డంగా దొరికిన జోగి..?

2012 లో స్టార్ హీరో రామ్ చరణ్ ను వివాహం చేసుకున్న తర్వాత కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ వచ్చింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సిఎస్ఆర్ కు ఆమె వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. లండన్ లోని రీజెంట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె.. హార్వర్డ్ యూనివర్సిటీలో సైతం ఉన్నత విద్యను అభ్యసించింది. జైడస్ గ్రూప్‌ తో సహా పలు బిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీల బోర్డులలో ఉపాసన కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలలో ఆమె స్వచ్చందంగా పాల్గొంటూ ఉంటారు.

Also Read : కొడాలి, వల్లభనేనికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..?

ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఉపాసన నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1,130 కోట్లుగా ఉంది. అంటే సుమారు 135 మిలియన్ డాలర్లు. ఆమె వ్యాపారాలు, కుటుంబ ఆస్తుల నుంచి వాటాలు సహా పలు విధాలుగా ఆమె నికర ఆస్తి పెరుగుతూ వచ్చింది. ఆమె భర్త, నటుడు రామ్ చరణ్ లతో కలిపి చూస్తే.. ఈ దంపతుల నికర ఆస్తుల విలువ దాదాపు రూ.2,500 కోట్లు. సుమారు 300 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం అపోలో గ్రూప్ ను విదేశాల్లో కూడా విస్తరించే విషయంలో ఉపాసన కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్