‘హనుమాన్’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగు చిత్రసీమలో కొత్త సంచలనం సృష్టించాడు. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన క్వాలిటీతో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి, నిర్మాతల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు “ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్” అంటేనే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా అని చెప్పే పరిస్థితి.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం నిర్మాతగానూ, దర్శకుగానూ అనేక ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 10 సినిమాల ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు, అందులో ప్రభాస్, రిషబ్ శెట్టి లాంటి స్టార్ హీరోలతో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. మరికొన్ని సంవత్సరాలు కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడానికి సమయం ఉండదనిపించేంతగా షెడ్యూల్ నిండిపోయింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం — “నా తదుపరి సినిమా మీకే” అని హామీ ఇస్తూ, ప్రశాంత్ వర్మ పలువురు నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నాడని , ఇక ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లో ఓ కొత్త స్టూడియో నిర్మాణంలో పెట్టుబడి పెట్టాడని టాక్.
Also Read : మనిషి ఇక్కడే ఉన్నా మనసు అక్కడే.. కరణం ఆవేదన
‘హను-మాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ తమ సంస్థతో ‘అధీరా’, ‘మహాకాళి’, ‘జై హనుమాన్’, ‘బ్రహ్మ రాక్షస’ వంటి ఐదు సినిమాలను చేస్తానని చేస్తానని ఒప్పందం చేసుకుని, వాటికి సంబంధించి అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని ‘హను-మాన్’ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి (ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్) ప్రశాంత్ వర్మపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్‌లు తీసుకున్నప్పటికీ, ఆ సినిమాలను పూర్తి చేయలేదని దీనివల్ల తమ సంస్థకు వ్యాపారపరంగా 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
నిరంజన్ రెడ్డిమాత్రమే కాక, సుధాకర్ చెరుకూరి, డీవీవీ దానయ్య, మైత్రి మూవీ మేకర్స్, హంబలే ఫిలిమ్స్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు మరికొంతమంది కొత్త నిర్మాతలు కూడా వర్మకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు ఇచ్చారట. మొత్తం విలువ దాదాపు ₹100 కోట్ల పైనే ఉండొచ్చని చెబుతున్నారు. కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం సాధ్యం కాకపోవడంతో, ప్రశాంత్ వర్మ నిర్మాతలకు “నేను స్వయంగా డైరెక్ట్ చేయను, కథ ఇస్తాను, దర్సకత్వ పర్యవేక్షణ చేస్తాను” అనే ఆప్షన్ ఇవ్వడం మొదలెట్టాడట. అయితే, నిర్మాతలు మాత్రం “ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తేనే సినిమా చేస్తాం” అని పట్టుబడుతున్నారు. ఫలితంగా, అడ్వాన్స్‌లు వెనక్కి ఇవ్వాలన్న ఒత్తిడి పెరిగిందని సమాచారం.
Also Read : సార్ మీ స్కిన్ కేర్ ఏంటీ..? మోడీతో మహిళా క్రికెటర్ కామెంట్
ఈ వివాదం ఎటు దారితీస్తుందో, ఈ చిక్కు నుంచి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎలా బయటపడతాడో చూడాలి. సినిమా ప్రపంచం అంతా ఇప్పుడు ఈ విషయం గురించే చర్చిస్తోంది.

