Wednesday, February 4, 2026 11:57 PM
Wednesday, February 4, 2026 11:57 PM

స్పిరిట్ కోసం ప్రభాస్ కొత్త లుక్.. వేరే లెవెల్ ప్లాన్..!

పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు.. స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్ లలోకి వచ్చే ఛాన్స్ ఉండగా.. సందీప్ రెడ్డి వంగా సినిమా షూటింగ్ విషయంలో పక్కా లెక్కలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ లుక్స్ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ కు మాస్, క్లాస్ ఇమేజ్ కు న్యాయం చేసే దిశగా మేకింగ్ ప్లాన్ చేసాడు వంగా. ఇక ఇప్పుడు వచ్చిన ఓ న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది.

Also Read : ఏపీలో కొత్తగా రెండు జిల్లాలు..!

ప్రస్తుతం ఓ ముఖ్యమైన సీన్ ను షూట్ షెడ్యూల్ చేసాడు. ఈ సినిమా ఇండియన్ సినిమాను షేక్ చేయడం ఖాయం అనే టాక్ వస్తోంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజున విడుదలైన ఆడియో టీజర్ సినిమాకు హైప్ ఓ రేంజ్ లో పెంచింది. ప్రభాస్ ను ఈ సినిమాలో నగ్నంగా చూపించేందుకు సందీప్ రెడ్డి రెడీ అయ్యాడు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ను కూడా అలాగే చూపించాడు సందీప్ రెడ్డి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆడియోలో ఈ విషయంలో క్లియర్ గా అర్ధమైంది. ఈ సినిమాలో జైలు సూపరింటెండెంట్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.

Also Read : నితీష్ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయడం లేదు..? చివరిసారి ఎప్పుడు పోటీ చేసారు..?

ప్రకాష్ రాజ్, ప్రభాస్ ఖైదీగా జైలులో ఉండగా.. అతనిని జైల్లోనే బట్టలు విప్పించాలని ఆర్డర్ వేస్తాడు. “సారే కాప్డే ఉతారో ఔర్ భేజో ఇస్కో మెడికల్ టెస్ట్ కే లియే” అంటూ ఆర్డర్ వేస్తాడు. దీనితో ప్రభాస్ ను అలా చూపించేందుకు సందీప్ రెడీ అయినట్టు టాక్. బ్లర్ గా ప్రభాస్ ను చూపించే ఛాన్స్ ఉందని టాక్ అదే జరిగితే మాత్రం.. ప్రభాస్ కెరీర్ మరో రేంజ్ లో ఉంటుందని అనలిస్ట్ లు కామెంట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న నాల్గవ చిత్రం స్పిరిట్. ప్రభాస్ తో పాటు, ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ కూడా నటిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్