Wednesday, February 4, 2026 11:42 PM
Wednesday, February 4, 2026 11:42 PM

ఒక్క మగాడు ఎలివేషన్.. పిచ్చి పీక్స్..!

మొంథా తుఫాన్ ఏపీ పైన పెను ప్రభావం చూపింది. అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ముందు నుంచే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. దీంతో ప్రాణనష్టం లేకుండా తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇదంతా ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్లే అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడే ఒక విషయం మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. అదేమిటంటే.. మొంథా తుఫాన్ ఆగిపోవడానికి ఏకైక కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనే మాట. సీఎంగా లేకపోయినా సరే.. తుఫాన్ నుంచి ఏపీ ప్రజలను కాపాడిన ఏకైక మగాడు.. అంటూ వైఎస్ కుటుంబ సొంత మీడియా సాక్షి టీవీ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read : లిక్కర్ స్కాం లో కొత్త పేరు.. అరెస్ట్ చేస్తారా..?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చింది సాక్షి. వైసీపీ అధికారిక కరపత్రం సాక్షి. నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా సరే.. అది సాక్షి దృష్టిలో తప్పు కానే కాదు. ఎందుకంటే.. సాక్షి పత్రిక యజమాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి. అందుకే జగన్ ఏం చేసినా అది కరెక్ట్. కానీ ప్రస్తుతం సాక్షి చేస్తున్న పనులు జగన్‌ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణ మొంథా తుపాన్ వార్తలను సాక్షి మీడియా ప్రసారం చేస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు.. జగన్‌కు శత్రువులు ఎక్కడో లేరు.. సాక్షి రూపంలో చుట్టూ తిరుగుతుంటారనే మాట బాగా వినిపిస్తోంది.

మొంథా తుఫాన్ సమయంలో జగన్ బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో ఉన్నారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత తీరిగ్గా తాడేపల్లికి వచ్చారు. అప్పుడు పార్టీ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని.. బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ వార్తను ప్రసారం చేసే సమయంలో సాక్షి చేసిన అతి.. జగన్‌ పరువును బజారున పడేస్తున్నాయి. “సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు” అంటూ సాక్షి టీవీ వార్తలు ప్రసారం చేసింది. ఇదే మాటను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. దీనికి జగన్ పేరును హ్యాష్ ట్యాగ్ చేసింది. ఇంతటితో ఆగకుండా.. మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక డిబేట్ కూడా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైసీపీ అధికార ప్రతినిధులు.. జగన్ మాత్రమే తుఫాన్ రాకుండా ఆపగలిగారని.. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అంటూ వ్యాఖ్యానించారు.

Also Read : సజ్జల భార్గవ్ కు ప్రమోషన్?? సాక్షిలో కీలక బాధ్యతలు..!

దీంతో అసలు జగన్ ఎక్కడ ఉన్నారు.. ఏం చేశారు.. తుఫాన్ రాకుండా జగన్ నిజంగానే ఆపారా.. బెంగళూరు నుంచి బంగాళాఖాతం వరకు చెయ్యి అడ్డుపెట్టి తుఫాన్ ఆపారా అని సోషల్ మీడియాలో పరువు తీస్తున్నారు. గతంలో హుద్ హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో సైలెంట్‌గా హైదరాబాద్ వెళ్లిపోయిన జగన్.. అవెంజర్స్ సినిమా చూశారని.. ఇక అధికారంలో ఉన్న సమయంలో కూడా బాధితులను పరామర్శించేందుకు స్పెషల్ సెట్ వేసిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చేసిన పనులను చెప్పుకుంటే.. నాలుగు ఓట్లు వస్తాయి తప్ప.. చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకుంటే.. పడే నాలుగు కూడా రావని ఎద్దేవా చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్