Sunday, October 19, 2025 03:53 AM
Sunday, October 19, 2025 03:53 AM
roots

గంభీరంగా గర్జించిన ఓజీ.. థియేటర్ లలో సింహగర్జన..!

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీరింది. తమ డాషింగ్ హీరో నుంచి ఎదురు చూస్తున్న బొమ్మ పర్ఫెక్ట్ గా డెలివరీ అయింది. నెలల తరబడి పెరిగిన అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అందుకున్నాడు ఓ జీ.. మాస్ ఆడియన్స్, పవన్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి బొమ్మ థియేటర్ లలో సింహ గర్జన చేస్తోంది. ఓ జీ, ఓ జీ అంటూ నినాదాలతో హోరెత్తిన అభిమానులకు.. ఆ టైటిల్ చాన్నాళ్ళ పాటు గుర్తుండే హిట్ కొట్టింది. ఏ మాత్రం డీలా పడకుండా కాలర్ ఎగరేసే బొమ్మ అంటూ పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read : తప్పుడు ప్రచారం ఖాతాలపై గురి.. తొక్కి పట్టి నార తీస్తున్న పోలీసులు

డైరెక్టర్ సుజిత్ తనపై ఉంచిన నమ్మకాన్ని.. అదిరిపోయే రేంజ్ లో హిట్ కొట్టి నిరూపించుకున్నాడు. ఆరేళ్ళ పాటు కష్టపడి వర్క్ చేసిన స్క్రిప్ట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫైనల్ గా థియేటర్ లలో ఓజీ సింహ గర్జన అత్యంత గంభీరంగా వస్తోంది. మెగా ఫ్యాన్స్ కు ముందుగానే దసరా, దీపావళి పండుగలు వచ్చేసాయి. తమన్ మ్యూజిక్ సినిమాకు పక్కా ప్లస్ అయింది. అలాగే, ఎలివేషన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ ను చూపించిన విధానం, యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన పద్ధతి అదరహో అంటున్నారు ఫ్యాన్స్.

Also Read: జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!

పవన్ ఫ్యాన్స్ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న గ్రాండ్ విక్టరీ.. అత్యంత గ్రాండ్ గా రావడంతో పండుగ చేసుకుంటున్నారు. కథలో పెద్దగా పట్టు లేకపోయినా.. పవన్ అనే ఇమేజ్ తో సినిమాను చాలా నీట్ గా అందించాడు సుజిత్. ఫైనల్ గా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ను అనౌన్స్ చేసాడు. ఈ బొమ్మతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ మార్కెట్ ఈ సినిమా పెంచడం ఖాయం అంటున్నారు అనలిస్ట్ లు. ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఏది ఏమైనా పవన్ ఫాన్స్ కి ఈ సినిమా మంచి విందు ఇచ్చింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్