Wednesday, February 4, 2026 08:16 AM
Wednesday, February 4, 2026 08:16 AM

నెయ్యి కల్తీగాళ్ళను వెనకేసుకొస్తున్న వైసీపీ

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించి, 16 ఏళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. సీబీఐ పిలిచినా కోర్టుకు రాకుండా, కేవలం వీడియో కాల్స్ ద్వారానే హాజరవుతానని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టారని ఆరోపించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిన జగన్, 2019లో ఓటమి భయంతో సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్యను సానుభూతి కోసం ‘ట్రంప్ కార్డు’గా ఉపయోగించుకుని గెలిచారని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా, ఇసుక, లిక్కర్, అక్రమ మైనింగ్, గంజాయి మాఫియాలతోపాటు అత్యాచారాలు వంటి వాటి ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడి, చివరికి దేవాలయాలను కూడా వదలకుండా అక్రమ సంపాదన ఎలా చేయాలో తన మనుషులకు నేర్పిన హీన చరిత్ర ఆయనదన్నారు.

Also Read : విజయనగరానికి దూరంగా బొత్సా కుటుంబం..? విశాఖపై ఫోకస్..?

వెంకటేశ్వర స్వామిని ఏమాత్రం కొలవని వై.వి. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి నాస్తికులను టీటీడీ ఛైర్మన్లుగా నియమించి, ఈ పవిత్ర సంస్థను అపవిత్రం చేశారన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా నాస్తికుడిని చైర్మన్‌గా నియమించడం జరిగిందని గుర్తు చేశారు. అమరావతిలో టీటీడీ ఆలయం కోసం చంద్రబాబు నాయుడు కేటాయించిన స్థలాన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉండి కుదించడం కూడా హిందూ మతంపై కక్ష కట్టడానికి నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ మతస్థుడో స్పష్టంగా చెప్పలేరని, సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించలేదు. జగన్మోహన్ రెడ్డి సతీమణి తిరుమలకు రాదని ఓట్ల కోసం ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేయించుకుని నాటకాలు ఆడుతున్నారని, పంతులు తీర్థం ఇస్తే దులుపుకున్నారని విమర్శించారు. ఇది కేవలం ‘కల్తీ నెయ్యి’ కాదని, సబ్బులు, పెయింట్లు తయారీకి వాడే రసాయనాలను కలిపి ‘నెయ్యి వాసన’ వచ్చే లిక్విడ్‌ను తయారు చేసి లడ్డూలో వాడారని ఆమె స్పష్టం చేశారు. ఈ విధంగా 63 లక్షల కిలోల కల్తీ నెయ్యి/రసాయనాలు ఉపయోగించి, రూ.250 కోట్లకు పైగా డబ్బును దోచుకున్నారని విమర్శించారు.

Also Read : ఆత్మాహుతే.. కారు నడిపిన ఎంబీబీఎస్ డాక్టర్..!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హెచ్చరించినా పట్టించుకోలేదని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన సిట్ నివేదికలో ఈ కల్తీ నిజమని తేలిందని పేర్కొన్నారు. రసాయనాలు సరఫరా చేసిన బోలే బాబా అనే వ్యక్తి వైష్ణవి కంపెనీ ద్వారా వై.వి. సుబ్బారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయంలో వై.వి. సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. వై.వి. సుబ్బారెడ్డి అన్నప్రసాదాల్ని మలినం చేస్తే, కరుణాకర్ రెడ్డి హయాంలో పరికామణిలో దొంగతనం జరిగిందని, దాని నుంచి అతన్ని కాపాడటానికి అతని ఆస్తులు రాయించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కల్తీ నెయ్యి స్కామ్ కు సంబంధించి సిట్ విచారణలో వై.వి. సుబ్బారెడ్డి నిజాలు బయట పెడతారా లేదా అనేది రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం. ఒకవేళ ఆయన నిజాలు చెబితే వెనుక ఉన్నవారి నుంచి ఆయనకు ‘గొడ్డలి పోటుకో’ లేదా ‘గుండె పోటుకో’ గురయ్యే ప్రమాదం ఉందా అనే సందేహాలు భయాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో, దోచుకున్న రూ. 250 కోట్లు ఎక్కడ ఉన్నాయో తేలాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Also Read : పాక్ ఆదేశాలతోనే వాటర్ ట్యాంకుల్లో విషం.. హైదరాబాద్ ఉగ్రకోణంలో సంచలనం

కిలో నెయ్యిలో ఒక 20 కిలోల రసాయనలు కలిపితే అది కల్తీ నెయ్యి అంటారు. నెయ్యి అనేది లేకుండా రసాయనాలతో ఒక లిక్విడ్ ను తయారు చేసి నెయ్యి అనే నామకరణం చేసి దాన్ని తీసుకొచ్చి లడ్డూలో కలిపారు. కల్తీ నెయ్యి కలిసిన లడ్డూ తిని అనారోగ్యం పాలైన వారందరిని ఆ వెంకటేశ్వరస్వామే కాపాడారని అన్నారు. తిరుమల లడ్డూను హిందువులు అత్యంత పవిత్రంగా పిల్లల అన్నప్రాశనలో సైతం వాడతారని, అలాంటి దాన్ని అపవిత్రం చేయడం కోట్ల మంది మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు టీటీడీ అభివృద్ధికి పాటుపడ్డారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ అభివృద్ది పథకంలోకి తీసుకెళ్లడమే కాకుండా దళితవాడల్లో సహా 500కు పైగా దేవాలయాలు కట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సిట్ బృందం మరింత దూకుడు పెంచి హిందూ మతం యొక్క నమ్మకాన్ని కాపాడాలని కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్